HometelanganaTelangana : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Telangana : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Telugu Flash News

Telangana News : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLA Poaching Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును రెండు వారాలపాటు నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించడంపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.

అయితే, ఇందుకోసం సుప్రీంకు వెళ్లేందుకు వీలుగా తీర్పును వాయిదా వేయాలని సింగిల్‌ జడ్జిని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ విన్నించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని బెంచ్‌ అత్యవసర విచారణకు అంగీకరిస్తూ స్వీకరించింది. ఇలా ఉండగా, ఈ కేసు విచారణ చేపట్టేందుకు ముందుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సూచన చేసింది.

ఈ నేపథ్యంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి కోరతామని అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు. బుధవారం సీజే అనుమతి కోరుతామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొయినాబాద్‌ ఫాంహౌస్‌ వ్యవహారం సీబీఐకి ఇవ్వాలని విన్నవిస్తూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి, న్యాయవాది బి.శ్రీనివాస్‌, కేరళకు చెందిన తుషార్‌ వెల్లపల్లి తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సెంట్రల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగిస్తూ గతేడాది డిసెంబర్‌ 26న తీర్పు వెల్లడించారు. అయితే, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సవాల్‌ చేశారు. మరోవైపు వీరు వేసిన అప్పీళ్లు విచారణార్హం కాదని హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీల ధర్మాసనం సోమవారం కొట్టేసింది. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఈ కేసు వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరగనుంది.

also read :

ఏపీ అప్పులు ప్రకటించిన కేంద్రం.. ఏటా ఎన్ని వేల కోట్లంటే!

-Advertisement-

kiraak RP : నన్ను ఎవరూ బ్యాడ్ చేయలేరు.. కిరాక్ ఆర్పీ కామెంట్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News