HomenationalKejriwal: దేశం కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం.. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిందన్న కేజ్రీవాల్‌

Kejriwal: దేశం కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం.. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిందన్న కేజ్రీవాల్‌

Telugu Flash News

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Kejriwal) మరోసారి మండిపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేతల అరెస్టులు, కస్టడీ, విచారణ.. ఇలా హడావుడి నెలకొంది. కుంభకోణంతో లింకులున్న అందరినీ పిలిపించి దర్యాప్తు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. నూతన మద్యం పాలసీలో తామెలాంటి తప్పిదాలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఇందులో దాచడానికేం లేదని చెప్పారు.

సీబీఐ ముందు నిజాయతీగా అన్నీ వాస్తవాలే చెబుతానని కేజ్రీవాల్ తెలిపారు. లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం తమ ముందు హాజరు కావాలని సీబీఐ సమన్లు అందజేసింది. దీంతో ఆయన సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్‌.. బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ వారు చాలా శక్తిమంతమైనవారని, ఎవరినైనా జైలుకు పంపగలరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు బలంగా డిమాండ్‌ చేస్తున్నారని, సీబీఐని అలా ఆదేశించి ఉంటారని ఆరోపించారు.

పార్టీ ఆదేశిస్తే సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఎందుకు ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ నేతలకు అధికారంతో వచ్చిన అహంకారం బాగా పెరిగిపోయిందని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించని మీడియా, జడ్జిలు.. ఇలా ఎవరిపైనైనా సరే.. బెదిరింపులకు పాల్పడటం పరిపాటిగా మారిందన్నారు. వారు చెప్పినట్లు వినకపోతే అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఖాయమని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దేశం కోసం తాను ప్రాణాలివ్వడానికి అయినా సిద్ధమని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ప్రజలు, వారి సమస్యలపై నేతలకు ఏమాత్రం పట్టింపులేదన్నారు.

నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, తనను జైల్లో పెట్టడం వల్ల దేశంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో తాను ఢిల్లీలోని స్కూళ్లన్నింటినీ బాగు చేశానని తెలిపారు. గుజరాత్‌ రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఒక్క పాఠశాలనైనా చక్కదిద్దారా? అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో బస్తీ ఆస్పత్రులు తెరిచి అందరికీ చికిత్స అందజేస్తున్నామన్నారు. 15 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇలా ఎందుకు చేయలేదని నిలదీశారు.

also read :

Rakesh-Sujatha : ఏంటి.. అప్పుడే రాకింగ్ రాకేష్‌, సుజాతల మ‌ధ్య గొడ‌వ‌లా..!

-Advertisement-

ఆ న‌టుడు న‌న్ను మోసం చేశారు అంటూ హీరోయిన్ సంఘ‌వి షాకింగ్ కామెంట్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News