Keerthy Suresh: ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అందాలభామ కీర్తి సురేష్. తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన సర్కారు వారి పాట, దసరా చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఈ చిత్రాల్లో కీర్తి రెండు విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులని మెప్పించింది.
సర్కారు వారి పాట చిత్రంలో అల్ట్రా మోడ్రన్ కన్నింగ్ లేడీ పాత్ర పోషించిన కీర్తి దసరా చిత్రంలో ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ రోల్‌లో అదరగొట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన కీర్తి రెండు దశాబ్దాల ప్రస్థానం పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఆమె ప్రేమ, పెళ్లికి సంబంధించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
కీర్తి సురేష్ తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకుంటున్నారంటూ గతకొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రిసార్ట్స్ ఓనర్ అయిన అతనితో కీర్తి సురేష్ రిలేషన్‌లో ఉందని, పెద్దలు వీరికి పెళ్ళికి అంగీకారం తెలిపారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిని కీర్తి తల్లిదండ్రులు ఖండించారు.
కీర్తి కోరుకున్నప్పుడే పెళ్లి చేస్తామంటూ వారు చెప్పుకొచ్చారు. అయితే తన పెళ్లికి సంబంధించిన ఎన్ని పుకార్లు వచ్చినా కీర్తి మాత్రం స్పందించదు. రీసెంట్‌గా మాత్రం ఇంస్టాగ్రామ్ ఛాట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ ని ఓ అభిమాని పెళ్లి ఎప్పుడని అడగడంతో ఆ ప్రశ్నకు కమెడియన్ వడివేలుతో కూడిన ఓ ఫన్నీ జిఫ్ ని షేర్ చేసి తనకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చేసింది.
also read : Keerthy Suresh Looks Stylish at Netflix Red Carpet Event