HomenationalKedarnath : భారీ వర్షాలు.. కేదార్ నాథ్ యాత్రకి బ్రేక్..

Kedarnath : భారీ వర్షాలు.. కేదార్ నాథ్ యాత్రకి బ్రేక్..

Telugu Flash News

Kedarnath : నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి. రాష్ట్రంలో పరిస్థితిని స్వయంగా సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యవేక్షిస్తున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. గౌరీ కుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు భారీ వర్షం కురుస్తున్నందున సోన్‌ ప్రయాగ నుంచి బయల్దేరిన భక్తులు ఆగాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.

ఈరోజు ఉదయం 8 గంటల వరకు 5,828 మంది భక్తులు సోన్ ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ యాత్రకు బయలుదేరారు. అయితే అధికారులు ముందుకు వెళ్లేందుకు అనుమతించలేదు. రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్‌లోని 7 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కేదార్ నాథ్ వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

read more :

Adipurush 9th Day Collections : 9 వ రోజు వసూళ్లతో ఊహించని విధంగా..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News