Sunday, May 19, 2024
HomecinemaAdipurush 9th Day Collections : 9 వ రోజు వసూళ్లతో ఊహించని విధంగా..

Adipurush 9th Day Collections : 9 వ రోజు వసూళ్లతో ఊహించని విధంగా..

Telugu Flash News

Adipurush 9th Day Collections : ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’ ఫస్ట్ వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. టాక్ ఎలా ఉన్నా ఈ సినిమా పెట్టుబడిని వెనక్కి తీసుకువస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఫస్ట్ వీకెండ్ ముగియడంతో గత సోమవారం నుంచి సినిమా కలెక్షన్లు భారీగా తగ్గుముఖం పట్టాయి.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు వరకు కోటి దాటిన కలెక్షన్లు ఒక్కసారిగా 7వ రోజు లక్షలకు పడిపోయాయి. ఇక 8వ రోజు ఈ సినిమా 65 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక ఏపీ తెలంగాణాలో 9వ రోజు ఈ సినిమా ఊహించని విధంగా ట్రస్ట్ ని బిల్ట్ చేసింది. నిన్న శనివారం 9వ రోజు ఆదిపురుష్ 1.08 కోట్ల షేర్ వసూళ్లను అందుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో పెరగడంతో బయ్యర్లలో కాస్త నమ్మకం పెరిగింది. అయితే ఈ లెక్కన ఆదివారం వరకు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. మళ్లీ సోమవారం వస్తే సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. టోటల్ గా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో తొమ్మిది రోజుల్లో ఈ సినిమా 77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 123 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇతర రాష్ట్రాలను పరిశీలిస్తే కర్ణాటకలో 11.96 కోట్ల షేర్ రాగా, తమిళనాడులో 2.30 కోట్ల షేర్ వచ్చింది.

కర్ణాటకలో ఇప్పటి వరకు కోటి షేర్ కూడా రాలేదు. ఈ చిత్రం 9 రోజుల్లో హిందీతో పాటు ఇతర రాష్ట్రాల్లో 66.70 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో 23.95 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ సినిమా 9 రోజుల్లో 182.82 కోట్ల షేర్ కలెక్షన్స్, 369.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఓవరాల్ గా 240 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 242 కోట్లుగా ఫిక్స్ అయ్యింది. 9 రోజుల కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఆదిపురుష్ సినిమా 59 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. ఏది ఏమైనప్పటికీ, ఆదివారం ఎంతో కొంత రావాలి. మరి ఈ సినిమా ఎంత వరకు నష్టాలను దూరం చేస్తుందో చూడాలి.

read more :

-Advertisement-

Prabhas : The Rise of a Pan India Star – Breaking Records and Entertaining Audiences Nationwide

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News