Homecinemaవంద కోట్ల క్లబ్‌కు చేరువలో Karthikeya 2.. కలెక్షన్ల సునామీ

వంద కోట్ల క్లబ్‌కు చేరువలో Karthikeya 2.. కలెక్షన్ల సునామీ

Telugu Flash News

బాలీవుడ్ లో Karthikeya 2 కలెక్షన్ల సునామీ

నిఖిల్ నటించిన Karthikeya 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత అన్ని భాషల్లో హిట్ అవుతుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 2014లో విడుదలైన కార్తికేయ చిత్రానికి ఇది సీక్వెల్.. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన చందు మొండేటి ఈ చిత్రానికి కూడా దర్శకుడిగా పనిచేశాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు.

వంద కోట్ల మార్క్‌కు చేరువలో Karthikeya 2

కార్తికేయ-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే వంద కోట్ల మార్క్‌ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీలో భారీగా కలెక్షన్ల వర్షం    కురుస్తుంది. ఏ సినిమాకైనా.. రోజులు గడిచే కొద్దీ కలెక్షన్లు తగ్గుతాయి. అయితే కార్తికేయ-2 వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హిందీలో రెండో శుక్రవారం రూ.2.46 కోట్లు, శనివారం రూ.3.04 కోట్లు, ఆదివారం రూ.4.07 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా ఒక్క బాలీవుడ్ నుంచే రూ.15.32 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో కూడా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Karthikeya 2

కృష్ణ తత్వంతో  ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది

అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో కృష్ణ తత్వాన్ని ప్రబోధించిన కార్తికేయ-2 తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులకే ఎక్కువ కనెక్ట్ అయ్యింది. తొలుత హిందీలో 50 స్క్రీన్లలో విడుదల చేసినా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో మూడు వేలకు పైగా స్క్రీన్లకు పెంచారు. నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

త్వర త్వరగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ షూటింగ్‌..!

బింబిసార స్ట్రీమింగ్ zee5 లో.. ఎప్పటి నుంచి.?

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News