కర్ణాటక (Karnataka) లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ (congress) ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే సోమవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (priyanka gandhi) అక్కడ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ప్రియాంక బీజీపీపై మండి పడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో మీ జీవితం మెరుగుపడిందా? మీ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. ర్యాలీలో రాష్ట్రంలో అవినీతి వల్ల 1.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. PSI స్కామ్ సిగ్గుచేటు అంటూ విమర్శించారు.
రాహుల్ గాంధీ (rahul gandhi) భారత్ జోడో యాత్ర (bharat jodo yatra) తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూలంగా అక్కడ వాతావరణం కనిపిస్తుండడంతో కాంగ్రెస్ నేతలు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మరో వైపు ప్రియాంక గాంధీ ర్యాలీతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఈ ర్యాలీలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలా అంశాలను అమలు చేస్తామని ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్ ను అక్కడ గెలిపిస్తే ప్రతి గృహిణులకు ప్రతి నెల 2000 అందచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటే 200 యూనిట్ల విద్యుత్ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు.
మరోవైపు కర్ణాటక ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా కూడా కర్ణాటకలో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి పార్టీ గెలుపు కోసం ఆయన వ్యూహరచన చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర శాఖ ఇటీవలి కాలంలో హుబ్లీ, చిత్రదుర్గ మరియు బీజాపూర్ లో భారీ స్థాయి ర్యాలీలు నిర్వహించింది. కాగా జనవరి 11 నుండి కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ బెల్గాం నుండి ప్రజాధ్వని యాత్ర కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా కర్ణాటకలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తో కలిసి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలు పార్టీ మారి బిజేపిలోకి వెళ్లడంతో బిజేపి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పుడు ఇది మళ్ళీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కర్ణాటకలో గెలవడం కోసం ముందు నుంచే వ్యూహరచన చేస్తుంది.ఈ సారి ఎలాగైనా అక్కడ బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని,ర్యాలీలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే హామీలు తీసుకువస్తున్నారు.
also read:
Iguana Island : ఈ అందాల దీవి ని కొంటారా? ఫ్లాట్ కంటే తక్కువ ధరకి..
తమిళ హీరో విజయ్ ఆంటోని కి తీవ్ర గాయాలు.. షూటింగ్ లో ప్రమాదం