Kantara: కన్నడ చిత్రం కాంతార దేశ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చడంతో జనాలు నీరాజనాలు పలికారు.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. అయితే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ‘కాంతార’ సినిమా యూనిట్ తమను సంప్రదించకుండా పాటను కాపీ చేయడంపై న్యాయపరంగా తేల్చుకుంటామని తైకుడం బ్రిడ్జి మ్యూజిక్ బ్యాండ్ ఇటీవల తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే యాజమాన్యం కోర్టుకెక్కింది.
తాజాగా ఈ కేసులో కోర్టు ‘కాంతార’ మేకర్స్‌కు ప్రతికూలంగా తీర్పు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
చిక్కుల్లో కాంతార (kantara)
‘కాంతార’ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘వరాహ రూపం’ అనే పాటను థియేటర్లలో ప్రదర్శించరాదంటూ కేరళ కోర్టు తీర్పునిచ్చింది.
తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా ఆ పాటను థియేటర్లలో ప్రదర్శించకూడదని కొజికొడె జిల్లా సెషన్స్ జడ్జ్ తెలిపారు ..
చిత్ర నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్.. ఈ ఫ్లాట్‌ఫామ్స్ ఏవీ తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా పాటను ప్లే చేయకూడదని కూడా కోర్టు పేర్కొంది.
కాగా, అక్టోబర్ 24న తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఇన్‌స్టాగ్రాం పేజ్ వేదికగా ‘కాంతార’ సినిమా మేకర్స్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి తమ ‘నవరసం’ అనే పాట నుంచి ‘వరాహ రూపం’ అనే పాటను కాపీ చేసి సినిమాలో వాడుకున్నారంటూ తీవ్రఆరోపణలు చేశారు.
మరి ఇప్పుడు కోర్ట్ ఆర్డర్‌తో చిత్ర బృందం ఎలాంటి అడుగులు వేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు క్రాస్ చేసింది. ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందుతుండగా, ఈ సినిమాకు అజనీష్ బీ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
read more news :
Viral Video: మితి మీరుతున్న రిస్కీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు.. నోరెళ్లపెడుతున్న నెటిజన్స్