Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు తన అందచందాలతో పాటు నటనతోను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ సినిమాల మీద సినిమాలు చేసింది.
సీనియర్ హీరోలతోనే కాకుండా జూనియర్లతోనూ చేసింది. ఇక కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే ఆమె పెళ్లి చేసుకొని ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి సినిమాలు చేయడం లేదు. ఇక, తల్లైన తర్వాత కాజల్ తన సమయాన్ని మొత్తం కొడుకు ‘నీల్ కిచ్లూ’తోనే గడుపుతుండడం మనం చూస్తున్నాం.
కేక పెట్టించే లుక్స్…
అయితే కొద్ది రోజులుగా కాజల్ రీఎంట్రీ ఇస్తుందనే టాక్ నడుస్తుంది. గతంలో మాదిరిగా ఈ అమ్మడు రెచ్చిపోయి వినోదం పంచనుందని అంటున్నారు. ఇండియన్ 2 సినిమా కోసం కాజల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్టు టాక్. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ కూడా చిత్రం కోసం చాలనే కష్టపడుతుంది. పలు విద్యలు నేర్చుకుంటుంది.
దాదాపు ఏడాదికి పైగానే సినిమాలు చేయకుండా ఉన్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ‘పుష్ప’కు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప ద రూల్’ మూవీలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేసేందుకు కాజల్ ఒప్పుకుందని, దీనికి సంబంధించిన టూన్స్‌ను కూడా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడని కూడా వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
గతంలో కాజల్ ‘జనతా గ్యారేజ్’ మూవీలో పక్కా లోకల్ అనే స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. మరోవైపు కాజల్ సోషల్ మీడియాలో తెగ సందడిచేస్తుండగా, తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుంది. కాజల్ క్యూట్ లుక్స్ కుర్రాళ్ల హృదయాలని దోచుకుంటున్నాయి.
View this post on Instagram