HomehealthAjwain: మ‌ధుమేహానికి చెక్ పెట్ట‌నున్న వాము.. ఇలా తీసుకుంటే మంచిది..!

Ajwain: మ‌ధుమేహానికి చెక్ పెట్ట‌నున్న వాము.. ఇలా తీసుకుంటే మంచిది..!

Telugu Flash News

Ajwain: మ‌న వంటింట్లో త‌ప్ప‌క ఉండే వాటిలో వాము ఒక‌టి. క‌డుపు నొప్పి వ‌చ్చినప్పుడో లేదంటే జీర్ణం కాన‌ప్పుడో వాముని మ‌నం ఉప‌యోగిస్తాం. వాములో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వామును అధిక బరువుకు చెక్ పెట్టేందుకు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

మధుమేహంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు వాము అద్భుతంగా ప‌ని చేస్తుంది. డయాబెటిస్ రోగులకి వాము ఔష‌దంగా ప‌ని చేస్తుంది. ఇందుకు కార‌ణం వాములో పైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఇలా చేయండి..

ఫైబర్ అనేది రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించడంతో పాటు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఒకవేళ మీరు డయాబెటిక్ రోగి అయితే..వాము లేదా అజ్వైన్ తప్పకుండా తీసుకోండి . దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. డయాబటిస్ ఉన్నప్పుడు బాడీ మెటబోలిజం సరిగ్గా ఉండదు. మెటబోలిజం వేగం తగ్గితే..బరువు పెరిగే అవ‌కాశం ఉంది.

వామును ప్రతిరోజూ డైట్‌లో భాగంగా తీసుకోవ‌డం అలవాటు చేసుకుంటే మంచిది. ఒక కప్పు నీళ్లలో ఒక స్పూన్ వాము వేసి ఉడికించి, ఆ తరువాత వడపోసి..భోజనం చేసిన 40 నిమిషాల తరువాత తప్పకుండా తీసుకోండి.

మీరు వాము గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టడం ఒక‌వేళ‌ మరచిపోతే ఏం ప‌ర్వాలేదు. వాము గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి.. మరగబెట్టండి. ఆ త‌ర్వాత వాటికి 5-6 తులసి ఆకులను జోడించండి. ఆ తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే మీకు ఫ‌లితాలు వ‌స్తాయి.

వాము నీటిని తాగడం వల్ల పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుందని అంటున్నారు.. అందరి వంటింట్లో ఉండే ఈ మసాలా దినుసును బరువు తగ్గేందుకు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో అరచెంచా వాము తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా ల‌భిస్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News