రష్యా, ఉక్రెయిన్ మధ్య సుమారు 11 నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు ధ్వంసమయ్యాయి. వందలాది మంది పౌరులు, వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం కూడా చాలా వరకు జరిగింది. ఈ తరుణంలో అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్‌స్కీ.. ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు.
యుద్ధం వల్ల ఉక్రెయిన్ తూర్పు భాగాన్ని రష్యా హస్తగతం చేసుకుంది. ఉక్రెయిన్‌లోని మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్ లాంటి నగరాలను రష్యా సైనికులు ఆక్రమించారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని మిగతా భాగాల్లోనూ రష్యా సేనలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. రష్యాను యుద్ధంలో ఎదుర్కొనడానికి ప్రపంచ దేశాల సాయం కోరిన జెలెన్‌స్కీ.. ఇందులో భాగంగా అమెరికా సాయం పొందగలిగారు.
రష్యాను ఎదుర్కోవడంలో భాగంగా ఆ దేశ సైనిక బలగాన్ని పెద్ద సంఖ్యలో మట్టుబెట్టామని ఉక్రెయిన్ ప్రకటించింది. కొన్ని సందర్భాల్లో రష్యాపై పైచేయి కూడా సాధించగలిగింది ఉక్రెయిన్. సైనికుల్లో ప్రేరణ కలిగించడానికి యుద్ధ క్షేత్రంలో కూడా జెలెన్‌స్కీ పర్యటించారు. అమెరికా నుంచి ఆయుధాలు, ఆర్థిక సాయం కూడా పొందారు. రాజధాని కీవ్ నగరాన్ని కాపాడుకోగలిగిన జెలెన్‌స్కీ.. యుద్ధాన్ని ఉద్దేశపూర్వకంగా రష్యా పొడిగించుకుంటూ పోతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ ఒంటరి కాదని, తాము అండగా ఉంటాయని పేర్కొన్న పెద్దన్న అమెరికా.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు ఎఫ్16 యుద్ధ విమానాలు సరఫరా చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఎఫ్16 యుద్ధ విమానాల సరఫరాను తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ఇచ్చేందుకు తాను పోలండ్‌లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.
also read :
Varla Ramaiah : ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై టీడీపీ ఆరోపణలు