Jobs in Bhabha Atomic Research Centre : ముంబైలోని బాబా అణు విద్యుత్ పరిశోధన కేంద్రం (BARC)లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ వెలువరించారు. బార్క్‌లో మొత్తం 4,374 టెక్నికల్ ఆఫీసర్లు, స్టయిపెండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 24వ తేదీ నుంచి మే నెల 22వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు వేసుకోవచ్చు.
టెక్నికల్ ఆఫీసర్/ సీకి సంబంధించి 181 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్/ బీకి సంబంధించి 7 పోస్టులు, టెక్నీషియన్/ బీకి సంబంధించి 24 పోస్టులు ఖాళీలున్నాయి. ప్రారంభంలో నెలకు టీవో ఖాళీలకు రూ.56,100, ఎస్‌ఏకు రూ.35,400, టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 ప్రకారం వేతనం చెల్లింపు ఉంటుంది.
ట్రైనింగ్ స్కీమ్ కింద మొత్తం 4,162 ఉద్యోగాలను ఫిల్ చేసేందుకు నిర్ణయించారు. ఇందులో కేటగిరీ-1 కింద 1,216 పోస్టులు, కేటగిరీ -2 కింద 2,946 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు స్టైపెండ్‌కు సంబంధించి నెలకు కేటగిరీ-1 వారికి రూ.24 వేల నుంచి రూ.26 వేల వరకు ఉంటుంది. కేటగిరీ-2 వారికి రూ.20 వేల నుంచి రూ.22 వేల దాకా చెల్లిస్తారు.
బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితర విభాగాలు ఉంటాయి. ఇక అర్హత విషయానికి వస్తే.. పోస్టును బట్టి టెన్త్ క్లాస్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీలో పాస్ అయి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, గుంటూరుతో పాటు విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
also read :
Viral Video : చిరుతకు చెంప చెళ్లుమనిపించిన ఉడుము.. తోకతో దెబ్బ ఇలా ఉంటుందా?