jeevitha and rajasekhar : నటుడు రాజశేఖర్ మరియు జీవితకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నాంపల్లి 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సాయిసుధ సంచలన తీర్పును వెలువరించారు. పరువు నష్టం కేసులో దంపతులకు జైలు శిక్ష పడింది.
2011లో మీడియా సమావేశంలో రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కేసు పెట్టారు. దీనిపై కోర్టు తన తీర్పును ప్రకటించింది.
జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే.. 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్‌లో విక్రయిస్తున్నారని జీతా, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపించారు.
దీన్ని సీరియస్‌గా తీసుకున్న చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలు, ట్రస్టులపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను పరువునష్టం కేసు నమోదైంది. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోతో పాటు మీడియాలో వచ్చిన కథనాలను కూడా జతచేసి కోర్టు ముందు ఉంచారు.
సుదీర్ఘ విచారణ అనంతరం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం.. రాజశేఖర్, జీవితకు ఏడాది జైలుశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. మరియు రూ.5 వేల జరిమానా విధించారు. అయితే, జరిమానా చెల్లించిన తర్వాత, ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం ఇవ్వబడింది మరియు వారిద్దరికీ 5 వేల వ్యక్తిగత పూచీకత్తు తో కోర్టు దంపతులకు బెయిల్ మంజూరు చేసింది, వారు పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతించారు.