Homecinemaజాన్వీ కపూర్ కు లక్కీ ఛాన్స్.. రామ్ చరణ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ

జాన్వీ కపూర్ కు లక్కీ ఛాన్స్.. రామ్ చరణ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ

Telugu Flash News

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్‌కి పరిచయమైన జాన్వీ కపూర్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా, ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. గ్లామర్ పాత్రలతో పాటు గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలీ వంటి బలమైన కథా చిత్రాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. త్వరలో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తొలి సినిమాగా తెరకెక్కుతోంది. శంకర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ ఈ సినిమాలో నటించనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్‌లో రూపొందనున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం జాన్వీ కపూర్‌ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే RRR తో పాన్ ఇండియా స్టార్ అయిన చరణ్ సరసన ఛాన్స్ అంటే జాన్వీ కపూర్ కు లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

మరోవైపు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం జాన్వీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.మొదటి భాగంలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆ అవకాశం జాన్వీ తలుపు తడుతోంది. చరణ్ సినిమాలో హీరోయిన్ గా చేసినా, పుష్ప2లో ఓ స్పెషల్ సాంగ్ కి ఓకే చేసినా.. మెగా కాంపౌండ్ నుంచే కదా .. జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయం అవుతుంది.

also read news:

ఈ వస్తువులను ఎవ్వరితో షేర్ చేసుకోకూడదని మీకు తెలుసా ?

beauty tips in telugu : రాత్రిపూట చర్మ సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు…

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News