Telugu Flash News

Janasena in Rayalaseema : సీమలో జనసేన బలం పెరిగిందా? కర్నూలులో అపూర్వ స్పందనే ఇందుకు సంకేతమా?

Janasena in Rayalaseema

ఏపీలో పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) సారథ్యంలోని జనసేన పార్టీ (janasena party) రోజురోజుకూ పుంజుకుంటోందా? ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రకే పరిమితమైన జనసేన బలం.. ఇప్పుడు రాయలసీమలోనూ కనిపిస్తోందా? రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో జనసేన ప్రాభవం బలపడుతోందా? అంటే కొన్ని లెక్కల ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఇంత వరకు అధికార పార్టీ లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడే పవన్‌ కల్యాణ్‌ కాస్త ప్రభావం చూపుతారని అనుకున్నారు.

ప్రస్తుతం జనసేనాని వచ్చే ఎన్నికల కోసం పెద్ద ప్లానింగే వేస్తున్నారు. ఇందులో భాగంగా అటు బీజేపీతో తెగదెంపులు చేసుకొని టీడీపీతో జతకట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే మాజీ సీఎం చంద్రబాబుతో భేటీ అయి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పుంజుకొని ఓటర్లను ఆకర్షించేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు.

తాజాగా పవన్‌ సోదరుడు నాగబాబు కర్నూలు వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జనసైనికుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి మీటింగ్‌ ఏర్పాటు చేశారు. రాయలసీమలో పవన్‌కు కాస్త ఆదరణ తక్కువ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే, ఊహించని విధంగా భారీ రెస్పాన్స్‌ వచ్చిందని జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

రాయలసీమలోనూ పాగాకు ప్లాన్‌..

జనసైనికుల స్పందన చూసి నాగబాబు ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతే ఇందుకు కారణమని ఆయన చెబుతున్నారు. అందుకే భారీ ఎత్తున జనసేన వైపు ఆకర్షితులవుతున్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనూ జనసేన కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగి ఉందని చెబుతున్నారు. దాంతోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులోనూ పాగా వేసేందుకు జనసేన ప్లాన్‌ చేస్తోందట. ఈ నేపథ్యంలో రాయలసీమలో వచ్చే ఎన్నికల్లో భారీగా ఓట్లు కొల్లగొట్టాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారట.

also read:

పై చదువుల కోసం అమెరికా వెళ్లే వారిలో హైదరాబాదీ స్టూడెంట్లదే హవా.. ఎంత మంది వెళ్తున్నారంటే..!

Rashmi Gautam: ఆపు నీ వేషాలు అంటూ ర‌ష్మీపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. అంత త‌ప్పు ఏం చేసింది..!

Exit mobile version