HomecinemaJai Balayya: మరీ ఇంతలా కాపీ కొట్టాలా.. పరువు తీసావ్ కదయ్యా థ‌మ‌న్.. నెటిజ‌న్స్ ట్రోల్స్

Jai Balayya: మరీ ఇంతలా కాపీ కొట్టాలా.. పరువు తీసావ్ కదయ్యా థ‌మ‌న్.. నెటిజ‌న్స్ ట్రోల్స్

Telugu Flash News

Jai Balayya: నంద‌మూరి బాల‌కృష్ణ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం వీర‌సింహా రెడ్డి. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు. మ‌రి కొద్ది రోజులలో సినిమా విడుద‌ల కానుండ‌డంతో మూవీ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు.

రీసెంట్‌గా థ‌మన్ స్వ‌ర‌ప‌ర‌చిన జై బాల‌య్య అనే సాంగ్ విడుద‌ల చేశారు. ‘జై బాలయ్య’ సాంగ్ ట్యూన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చేసిన ‘ఒసేయ్ రాములమ్మా’ ట్యూన్‌ని పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోలింగ్ నడుస్తోంది.

తమన్ ని కాపీ క్యాట్ అంటూ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ట్రోలర్స్ రామజోగయ్య శాస్త్రి గారి పేరు ముందు ఉన్న సరస్వతీపుత్ర అనే బిరుదును కూడా అవహేళన చేస్తూ కామెంట్లు పెట్టారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న త‌ప్ప‌క స్పందించాల్సి వ‌చ్చింది. ‘ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టు జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..

ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి” అంటూ షాకింగ్ పోస్ట్ వదిలారు రామజోగయ్య శాస్త్రి. అయితే జై బాల‌య్య పాట ఇప్పుడు బాల‌కృష్ణ‌కి పాజిటివ్‌ని తేక‌పోగా, ఎక్కువ‌గా నెగిటివిటీని తెచ్చిపెట్టింది.

-Advertisement-

హీరో పేరు వీరసింహారెడ్డి అయినప్పుడు జై బాలయ్య ఎక్కడి నుండి వచ్చిందని నెటిజ‌న్స్ ప్రశ్నిస్తున్నారు. లాజిక్ పాడు లేకుండా జై బాలయ్య ను వాడేశారని, దానికి తోడు థమన్ ట్యూన్.. ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ లా ఉందని ట్రోల్ చేస్తూ దాని తాలూకు ఎడిటింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

బాలయ్య లుక్, ప్రోమోలు వీరసింహారెడ్డి చిత్రానికి మంచి హైప్ తేగా, జై బాలయ్య మాత్రం ఆయ‌న‌కి చాలా చెడ్డ పేరు తెచ్చింద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అఖండ మూవీలో ‘జై బాలయ్య’ సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విష‌యం తెలిసిందే.

also read news:

India: టీమిండియా అభిమానులు ఇక ఊపిరి పీల్చుకోండి… కింగ్ ఈజ్ బ్యాక్

మెంతికూర నువ్వుల పచ్చడి.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News