HomecinemaJabardasth | Sowmya Rao : జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ఎవ‌రు లేని అనాథ‌నా ? తన స్టోరీ ఏంటి ?

Jabardasth | Sowmya Rao : జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ఎవ‌రు లేని అనాథ‌నా ? తన స్టోరీ ఏంటి ?

Telugu Flash News

Jabardasth | Sowmya Rao : :జ‌బ‌ర్ధ‌స్త్ షోతో యాంక‌ర్ అన‌సూయ‌, ర‌ష్మీ గౌత‌మ్ ఎంత పాపులారిటీ అంది పుచ్చుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు చిన్న చిన్న కార్య‌క్ర‌మాలు చేసుకున్న వీరిద్ద‌రు ఇప్పుడు టాప్ సెల‌బ్రిటీల‌లో ఒకరిగా మారారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న అనసూయ జ‌బ‌ర్ధ‌స్త్‌కి గుడ్ బై చెప్ప‌డంతో ఆమె స్థానంలో కన్నడ అందం సౌమ్యా రావు వ‌చ్చి చేరింది.

ఈ భామ గతంలో సీరియల్స్‌లో నటించి అల‌రించింది. ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ లో సందడి చేసిన సౌమ్య రావు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌కి కూడా రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఇందులో సౌమ్య రావు తెర వెనుక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టారు. ఇందులో తాను అనాథని అని చెప్పడం షాక్ కి గురి చేస్తుంది. అమ్మ కొన్ని సంవ‌త్స‌రాల క్రితం చనిపోయారు. నాన్న ఉన్నా కూడా లేనట్లే. ఆయన నన్ను ఏ నాడు పట్టించుకోరు.

ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మా, నాన్నా, అన్న, చెల్లి ఎవరో ఒకరు ఉన్నారు, కాని నాకు మాత్రం ఎవరూ లేరంటూ సౌమ్య కన్నీరు పెట్టుకున్నారు. ఈ మాట‌లు విన్న ప్ర‌తి ఒక్క‌రికి హృద‌యం ద్ర‌వించింది. ఆమెకు అభిమానులు మేమున్నాం అంటూ స‌పోర్ట్ అందిస్తున్నారు.

రష్మీ సైతం తండ్రి వదిలేసి వెళితే సింగిల్ మదర్ నన్ను ఎంతో కష్టపడి పెంచారని గతంలో చెప్పగా, ఆ క‌సితోనే చాలా హార్డ్ వ‌ర్క్ చేసి ప్ర‌స్తుతం ఈ స్థాయిలో ఉంది ర‌ష్మీ. మ‌రి ఇప్పుడు సౌమ్య రావు కూడా ఆ రేంజ్ గుర్తింపు తెచ్చుకుంటుందా లేదా అనేది చూడాలి.

సౌమ్య రావు సీరియ‌ల్స్‌లో ఎక్కువ‌గా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ల‌ని మాత్ర‌మే చేసేది. తెలుస్తోన్న సమాచారం ప్రకారం సౌమ్య రావు‌కు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి 60 వేలు ఇస్తున్నట్టు టాక్. రానున్న ఎపిసోడ్స్‌లో ఆమె ప‌ర్‌ఫార్మెన్స్ ని బ‌ట్టి పెంచే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

-Advertisement-

also read news: 

మెరుగైన మెదడు పనితీరు కోసం ఒమేగా-3.. ఏ ఏ ఆహారాల ద్వారా ల‌భిస్తుందంటే ?

చలికాలం లో పుణుగులు తింటే ఆ మజానే వేరు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News