HomecinemaJabardasth: జ‌బ‌ర్ధ‌స్త్ షోకి కొత్త జ‌డ్జి.. ఈ సారి మ‌రో హీరోయిన్ ఎంట్రీ

Jabardasth: జ‌బ‌ర్ధ‌స్త్ షోకి కొత్త జ‌డ్జి.. ఈ సారి మ‌రో హీరోయిన్ ఎంట్రీ

Telugu Flash News

Jabardasth: బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ప్రేక్ష‌కులని ఎంతగా అలరించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోకి ఎక్కువ ఏళ్లు పనిచేసిన వాళ్లలో రోజాతో పాటు నాగబాబు ఉన్నారు. జబర్దస్త్ జడ్జీలుగా రోజా, నాగబాబుల జోడీ ఎవర్‌ గ్రీన్ అని ప్ర‌తి ఒక్క‌రు ఒప్పుకుంటారు. జబర్దస్త్ ఫ్యామిలీ అంతలా విస్తరించింది అంటే.. ఈ ఇద్దరి కృషి ఎంతో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరూ జబర్దస్త్ నుంచి వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చేయడంతో.. జబర్దస్త్ షో కళ త‌ప్పిన‌ట్టుగా అనిపించింది. రోజా జడ్జీగా చాలా హుందాగా బయటకు వచ్చింది కానీ.. నాగబాబు మాత్రం కొంత కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేశాడు. దాదాపు ఏడేళ్లకు పైగా జబర్దస్త్ జడ్జీగా చేసిన నాగబాబు.. అక్కడ నుంచి బయటకు వచ్చి.. మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి పైన.. ఈటీవీ యాజమాన్యం పైన ఎన్నో విమ‌ర్శ‌లు చేశారు.

క‌ట్ చేస్తే నాగ‌బాబు, రోజాల త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ జడ్జి సీటులో చాలా మంది వ‌చ్చి కూర్చున్నారు. అయితే ప్ర‌స్తుతం కృష్ణ భ‌గ‌వాన్, ఇంద్ర‌జ జ‌డ్జిలుగా ఉన్నారు. తాజా ఎపిసోడ్‌లో నటుడు కృష్ణ భగవాన్ తో పాటు జబర్దస్త్ జడ్జి సీటును సదా పంచుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.. ట్రెండీ వేర్లో సదా సూపర్ గ్లామరస్ గా కనిపించారు. ఆమె రాక జబర్దస్త్ కి మేలు చేస్తుందని మేకర్స్ అనుకుంటున్నారు. . ఆమె ఇమేజ్ ఆదరణ తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు. మొన్నటి వరకు వరకు సదా బీబీ జోడి డాన్స్ రియాలిటీ షోలో సంద‌డి చేస్తూ క‌నిపించింది. తాజాగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ సైతం ఈ షోకిరీఎంట్రీ ఇచ్చాడు.

షో బిగినైన కొత్తల్లో షకలక శంకర్ టీం లీడర్ గా ఉండి మంచి పేరు సంపాదించాడు.. వెండితెరపై బిజీ అయిన ఆయన జబర్దస్త్ వదిలేశాడు. ఇప్పుడు మ‌ర‌లా ఈ షోలో అడుగుపెట్టాడు. అయితే గ‌తంలో కూడా కొన్ని రియాలిటీ షోలకు సదా జడ్జిగా వ్యవహరించిన విష‌యం తెలిసిందే. తెలుగు పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ రెండు సీజన్స్ కి జడ్జిగా చేసిన ఆమె జయా టీవీలో ప్రసారమైన షోకి మొదటిసారి ఆమె జడ్జిగా వ్యవహరించాచి ఎంతో ఆక‌ట్టుకుంది. ఇక సదా కెరీర్ పరిశీలిస్తే ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఎన్నో ఏళ్లు వుతుంది.. 2018లో విడుదలైన తమిళ చిత్రం టార్చ్ లైట్ తర్వాత మరలా ఆమె క‌నిపించింది లేదు. జ‌యం సినిమాతో ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని కొల్ల‌గొట్టింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News