IPL 2023 : ఐపీఎల్‌లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు, హైదరాబాద్ వాసి తిలక్ వర్మ (tilak varma) కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. గత సీజన్లోనూ ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన తిలక్ వర్మ.. ఈ సీజన్లోనూ ముంబైని ఆదుకుంటున్నాడు. తాజాగా 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది.
Jack Teixeira : రెండు పదుల వయసుకే అమెరికా రహస్యాలు బయటపెట్టాడు.. యువకుడిని అరెస్టు చేసిన ఎఫ్‌బీఐ
ముంబై ఇండియన్స్ జట్టులో సమష్టిగా రాణించలేకపోవడంతో వరుస ఓటములపాలు కావాల్సి వస్తోంది. అయితే, జట్టులో ఎవరు ఆడినా ఆడకపోయినా తానున్నానంటూ ఓ కుర్రాడు అదరగొట్టేస్తున్నాడు. అతడే హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ. తనదైన శైలి బ్యాటింగ్‌తో జూనియర్ యువరాజ్ సింగ్ మాదిరిగా బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు.
Ram Charan: రామ్ చరణ్ తనకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చెప్పిన ఉపాసన
అపోజిషన్ ఎలాంటిదైనా తగ్గేదే లేదంటూ బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 84 రన్స్‌తో రాణఇంచాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ 22 పరుగులు చేశాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులతో ప్రతిభ చాటాడు.
Poorna: పూర్ణతో ఎఫైర్‌పై ఎట్టకేలకు స్పందించిన రవిబాబు..!
ఆడిన మూడు మ్యాచ్‌లలోనే 147 పరుగులు చేసి అబ్బురపరుస్తున్నాడు. ముంబై తరఫున ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటి వరకు తిలక్ వర్మ నిలిచాడు. అవకాశం వచ్చిన ప్రతి సారీ తానేంటో నిరూపించుకుంటున్నాడు తిలక్ వర్మ. ఇక ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతం అవుతోంది.
Actress Prema: విడాకులు, రెండో పెళ్లిపై స్పందించిన అలనాటి స్టార్ హీరోయిన్
కెప్టెన్ రోహిత్ శర్మ గత మ్యాచ్‌లో అర్ధ శతకం నమోదు చేసి తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఇక ఇషాన్ కిషన్ పూర్తి స్థాయిలో ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ అయితే, ఘోరంగా విఫలమవుతున్నాడు. టీమిండియా తాజాగా ఆడిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ వరుసగా డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్.
ఇక మిడిలార్డర్ కూడా కోలుకోవాల్సి ఉంది. ఇలా జట్టు సభ్యులంతా ఫామ్ అందుకుంటే తప్ప టోర్నీలో విజయాలను నమోదు చేయలేని పరిస్థితి ఉంది. ఇక యువ కిశోరం తిలక్ వర్మ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. తాజాగా అతడికి అరుదైన గౌరవం దక్కింది. తిలక్ వర్మతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పొజిషనింగ్, ఎండార్స్‌మెంట్స్, ప్రదర్శనలు, సోషల్ మీడియా మానిటైజేషన్, లైసెన్సింగ్ సహా అన్ని రకాల యాడ్స్ కార్యకలాపాలను నిర్వహించే రిలయన్స్ యాజమాన్యంలోని స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ రైజ్.. ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించింది. ఇక మీదట కొన్ని రిలయన్స్ ప్రకటనల్లో తిలక్ వర్మ కనిపించనున్నాడు.