HomebusinessFlipKart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ సొంతం చేసుకోండి..

FlipKart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ సొంతం చేసుకోండి..

Telugu Flash News

FlipKart: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్ర‌తి ఏటా బిగ్ బిలియన్ డేస్ సేల్ ( Big Billion Days Sale 2022) నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా సేల్ నిర్వ‌హించ‌నుండ‌గా, తాజాగా తేదీలను కూడా ప్రకటించింది.

సెప్టెంబ‌ర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ను నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించారు.. సరిగ్గా ఇదే తేదీన అమెజాన్ కూడా తమ ‘గ్రేట్ ఇండియన్ సేల్’ను ప్రారంభిస్తుండటం ఇక్క‌డ చెప్పుకోవ‌ల్సిన విష‌యం. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో ఐఫోన్స్‌ని త‌క్కువ ధ‌ర‌కు అందింనున్న‌ట్టు తెలుస్తుంది.

ఊహించ‌ని ధ‌ర‌ల‌తో..

ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11ని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు సేల్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. యాపిల్ ఐఫోన్‌ 13ని రూ. 49,990 లేదా అంతకంటే తక్కువకి సేల్ చేయ‌నున్నార‌ట‌.

ఇక ఐఫోన్‌13 ప్రొని రూ. 89,990 లేదా అంతక‌న్నా తక్కువ ధరకు, ఐఫోన్‌13 ప్రొ మ్యాక్స్ ని రూ. 99,990 లేదా అంతక‌న్నా తక్కువ ధరకు సేల్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ధ‌ర‌ల‌కు క‌నుక సేల్ పెడితే క‌స్ట‌మర్స్ ప‌రుగులు తీయ‌డం ఖాయం అని కొంద‌రు అంటున్నారు.

ప్ర‌స్తుత ధ‌ర‌ల విష‌యానిక వ‌స్తే ఐఫోన్ 13 ధర రూ. 69,900గా ఉంది, ఐఫోన్ 13 ప్రో ధర రూ. 1,19,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,26,000గా ఉన్నాయి.

ఇక ఐఫోన్‌12 మినీ ప్రస్తుత ధర రూ.55,359, ఐఫోన్‌ 11 ధర రూ.43,990 గా ఉండ‌గా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022లో ఐఫోన్‌ 12 మినీని రూ.39,990కి, ఐఫోన్‌ 11ని రూ.29,990కి సేల్ చేసే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం విడుద‌లైన న‌థింగ్ ఫోన్స్‌ని కూడా త‌క్కువ ధ‌రకు ఇవ్వ‌బోతున్నార‌నే టాక్ న‌డుస్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News