“ఓ దేవా ! ఇది మాట్లాడుతోంది” అని ఆశ్చర్యంతో బ్రెజిల్ చక్రవర్తి మూర్చిల్లి నేలపై పడి పోయాడు; అలెగ్జాండర్ గ్రహంబెల్ (Alexander Graham Bell) మాత్రం మాటలు కొనసాగిస్తున్నాడు. 1876లో ఇది జరిగింది. గ్రహంబెల్ తను కనుగొన్న నూతన పరికరాన్ని పరీక్షకు పెట్టాడు. అదే టెలిఫోన్.
గ్రహంబెల్ స్కాట్ లాండ్లో జన్మించాడు. అతడు ఉపాధ్యాయుడు, మూగ, చెవిటి వారికి చదువు చెప్పడానికి తన జీవితాన్నే అంకితం చేశాడు. తీవ్రమైన వ్యాధిగ్రస్తుడై కెనడా చేరాడు. 1870లో అక్కడ కూడా చెవిటి మూగవాళ్లు వినడం మాట్లాడం నేర్పడంలో గడిపాడు.
బోస్టన్లో 1873లో ఫిజియో లజీ ప్రొఫెసర్గా నియుక్తు డయ్యాడు. 1875లో బెల్ జీవితం ఒక మలుపు తిరిగింది. తన ప్రక్క గదిలో వున్న వాట్సన్తో సిగ్నల్స్ ద్వారా పంపగా ఆ శబ్దాలను విన్నాడు వాట్సన్, అదే టెలిఫోన్ తయారీకి నాంది. మొదటిసారిగా టెలిఫోన్ తయారు చేసి వాట్సన్ తో మాట్లాడాడు.
1876లో బెల్ పేటెంట్ సంపాదించి టెలిఫోన్ కంపెనీ స్థాపించి కోట్లు ఆర్జించినా నిగర్వి నిరాడంబరుడు. అతడు తర్వాత అన్ని దేశాలు తిరిగి టెలిఫోన్లు వుండటం గమనించాడు. అమెరికాలో మొదటి టెలిఫోన్ వ్యవస్థను ప్రారంభించినప్పుడు బెల్ ని పిలిచి అతడితోనే మాట్లాడించారు.
మొదట మాట్లాడిన మాటలే మాట్లడగా “మిమ్మల్ని చేరాలంటే 10 రోజులు పడుతుంది గురువుగారూ” అన్నాడు వాట్సన్. ఆయన మరణించిన రోజున అమెరికాలో టెలిఫోన్లన్ని పక్కన పెట్టి ఆయనకు సంతాపం వ్యక్తం చేసింది. బెల్ ప్రపంచాన్ని దగ్గర చేసిన మహనీయుడు. ఈయన 1922లో కెనడాలో మరణించాడు.
Frequently Asked Questions
1) అలెగ్జాండర్ గ్రహంబెల్ ఎప్పుడు జన్మించాడు?
మార్చి 3, 1847.
2) అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్‌ను ఏ సం.లో కనుగొన్నాడు?
1876.
3) గ్రహంబెల్ జన్మించిన ప్రాంతం?
ఎడిన్ బర్గ్ (యు.కె)
4) అలెగ్జాండర్ గ్రహంబెల్ కనుగొన్న ముఖ్యమైన ఆవిష్కరణ?
టెలీఫోన్ .
5) టెలిఫోన్ ఆవిష్కరణకుగాను గ్రహంబెల్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం అందజేసిన పురస్కారం?
ఓల్టా పురస్కారం.
6) అలెగ్జాండర్ గ్రహంబెల్ జన్మదినాన్ని ఏ దినంగా జరుపుకుంటారు?
టెలీఫోన్ దినోత్సవం
7) గ్రహంబెల్ టెలిఫోన్ ద్వారా తొలిసారిగా ఎవరితో మాట్లాడాడు?
వాట్సన్ గారితో.
8)టెలిఫోన్ ఆవిష్కరణ అనంతరం గ్రహంబెల్ స్థాపించిన కంపెనీ?
బెల్ టెలీఫోన్ కంపెనీ
9) అలెగ్జాండర్ గ్రహంబెల్ ఎప్పుడు మరణించాడు?
1922 ఆగష్టు 2.
10) గ్రహంబెల్ ఏ వ్యాధి వలన మరణించాడు?
డయాబెటీస్