Telugu Flash News

N. R. Narayana Murthy : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ప్రస్థానం.. రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ మీ కోసం..

సొంత కంపెనీని స్థాపించి జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అలా ఒక కంపెనీని ప్రారంభించి దాన్ని అభివృద్ధి చేయాలంటే చాలా ఓపిక, గట్టి సంకల్పం కావాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బయపడకుండా ప్రతి సవాలును దైర్యంగా ఎదురుకోగలగాలి. అలా మంచి కంపెనీని స్థాపించేంత ఓపిక, దైర్యం కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు.ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి (Narayana Murthy) కూడా అలాంటి వారిలో ఒకరు.

1946, ఆగస్ట్ 21న కర్ణాటకలోని సిడ్లఘట్టలో ఒక మామూలు మధ్య తరగతి బ్రహ్మిన కుటుంబంలో జన్మించారు నారాయణ మూర్తి. చిన్న తనం నుంచే చదువులో చురుగ్గా ఉంటూ వచ్చిన నారాయణ మూర్తి తన ప్రాథమిక విద్యనంతా సిడ్లఘట్టలోనే పూర్తి చేయగా మైసూర్ యూనివర్సిటీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.

ఆ తరువాత కాన్పూర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. చదువు పూర్తయిన తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్‌లో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టారు.

ఆ సమయంలోనే ఆయనకు నచ్చిన సుధను వివాహమాడి వారి ప్రేమకు ప్రతి రూపంగా ఇద్దరు పిల్లలు రోహన్,అక్షతలకు జన్మనిచ్చారు. వాళ్ళ కూతురుకు నచ్చిన, ప్రతిభ కలిగిన రిషి సునాక్ తో వివాహం జరిపించారు నారాయణ మూర్తి. ఆయన అల్లుడు రిషి సునాక్ ఇటీవలే బ్రిటన్ ప్రధాని పదవిని సొంతం చేసుకుని మూర్తి నమ్మకాన్ని నిలబెట్టడం విశేషం.

ఇన్ఫోసిస్ స్థాపన:

ఎప్పట్నుంచో తనంతట తాను ఒక సంస్థను స్థాపించాలని అనుకుంటూ వచ్చిన నారాయణ మూర్తి సాఫ్ట్ ట్రోనిక్స్ అనే కంపెనీని ప్రారంబించారు.అది అలా ప్రారంభించిన సంవత్సరానికి ఘోరంగా విఫలమవ్వడంతో ఆ కంపెనీని మూసేసి పూణేలోని పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో పని చేయడం మొదలపెట్టారు.

తన సొంత కంపెనీ ఆశను వదిలేసి వెళ్లిన మూర్తి కొంత కాలం వేరే కంపెనీలో పని చేస్తూ జీవితం సాగించారు. కానీ సొంత కంపెనీ అనే ఆశ రోజు రోజుకీ పెరుగుతుండడంతో,ఎలాగైనా కంపెనీని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఆయన భార్య సుధా మూర్తి దగ్గర నుంచి 10,000 వేలు అడిగి తీసుకుని నందన్ నిలేకని అనే వ్యక్తితో కలిసి 1981లో ఇన్ఫోసిస్ ను స్థాపించారు.

ఆలా స్థాపించినప్పటి నుంచి 2002 వరకు ఆయనే ఇన్ఫోసిస్ కి సీఈఓగా(CEO) వ్యవహరించారు. ఆ తరువాత కొంత కాలం ఇన్ఫోసిస్ కి చైర్మన్ గా కూడా విధులు నిర్వహించారు. ఆయన తెలివితో,అందర్నీ ఆశ్చర్య పరిచే ప్రతిభతో నలుగురికి ఆదర్శంగా నిలిచారు నారాయణ మూర్తి.

అంతటి గొప్ప వ్యక్తి అయిన నారాయణ మూర్తి గురించి ప్రపంచంలోనే పెద్ద పత్రికలలో ఒకటైన టైమ్స్ వాళ్ళు,న్యూస్ ఛానల్ అయిన సి.ఎన్.బి.సి(CNBC) వాళ్ళు ఆయనను”ఐటీ సెక్టార్ కి భారతీయ పితామహుడు”అని పేర్కొంటూ ప్రశంసల వర్షం కురిపించాయి.

భారత ప్రభుత్వం ఆయన అద్భుతమైన ప్రతిభకు మెచ్చి 2008లో నారాయణ మూర్తిని పద్మభూషణ్ తో సత్కరించింది.

also read news: 

India: టీమిండియాకి గుడ్ న్యూస్.. గాయాల బారిన ప‌డ్డ వారంద‌రు తిరిగి వ‌చ్చేస్తున్నారు..!

mancherial : వివాహేతర సంబంధం.. ఆరుగురి సజీవ దహనం.. పోలీసులు ఏం చెప్పారు ? అసలు స్టోరీ ఏంటి ?

 

 

Exit mobile version