Homecinemaదసరా మూవీలోని బ‌రాత్ బీట్‌కి ఇంద్రజ మాస్ డ్యాన్స్.. వీడియో వైర‌ల్

దసరా మూవీలోని బ‌రాత్ బీట్‌కి ఇంద్రజ మాస్ డ్యాన్స్.. వీడియో వైర‌ల్

Telugu Flash News

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ద‌స‌రా (dasara) సాంగ్స్ ఎంత‌గా ట్రెండ్ అయ్యాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ కి అయితే ఎంతో మంది తెగ రీల్స్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ తో పాటుగా దసరా మూవీలోనే కీర్తి సురేష్ (keerthy suresh) డాన్స్ వేసిన మాస్ బీట్ ని కూడా అనుక‌రిస్తూ తెగ చిందులేస్తున్నారు. పెళ్లి కూతురి చీరలో కీర్తి వేసిన డ్యాన్స్ కి అభిమానులు తెగ ఫిదా కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఇదే త‌ర‌హాలో స్టెప్పులేస్తున్నారు.

తాజాగా అలనాటి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ (indraja) ఇదే బీట్ కు మాస్ డ్యాన్స్ వేసి కీర్తి సురేష్ ను మైమరపించేసింద‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం జబర్దస్త్ (jabardasth) , శ్రీదేవీ డ్రామా కంపెనీకి (sridevi drama company) ప్రోగ్రామ్స్ కు జడ్జీగా వ్యవహరిస్తున్న ఇంద్ర‌జ‌.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బ‌రాత్ బీట్‌కి మాస్ స్టెప్పుల‌తో ర‌చ్చ చేసింది.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇది తెగ వైర‌ల్ అవుతుంది. అచ్చం పెళ్లి కూతురి చీరకట్టుతో తీన్ మార్ బీట్ కు మాస్ స్టెప్పులు వేయ‌డంతో నెటిజ‌న్స్ ఇంద్ర‌జ‌పై ప్ర‌శంసల జ‌ల్లు కురిపిస్తున్నారు.

 

also read :

Viral Video : పాములు సంభోగంలో ఉండగా డిస్టర్బ్‌ చేసిన డేరింగ్‌ గర్ల్‌..!

-Advertisement-

Mrunal Thakur Super Hot Stills, Images, Photos 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News