HomesportsIndia: టీమిండియాలా లేదు.. గుజ‌రాత్ జ‌ట్టులా ఉంది.. జ‌ట్టు ఎంపిక‌పై నెటిజ‌న్స్ ట్రోల్స్

India: టీమిండియాలా లేదు.. గుజ‌రాత్ జ‌ట్టులా ఉంది.. జ‌ట్టు ఎంపిక‌పై నెటిజ‌న్స్ ట్రోల్స్

Telugu Flash News

India: కొత్త ఏడాది టీమిండియా విజ‌యంతో సిరీస్ మొద‌లు పెట్టింది. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జ‌న‌వ‌రి 3న తొలి టీ20 జ‌రిగింది. ఇందులో 2 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది ఇండియా. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా.. కొంద‌రు ఆట‌గాళ్లకి మరోసారి మొండిచేయ్యే చూపించింది. గతేడాది టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు ఆడిన ప్రతీ సిరీస్‌కు ఎంపికైన రాహుల్ త్రిపాఠి.. ఈ సారి మాత్రం తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన రాహుల్ త్రిపాఠి వాటర్ బాయ్‌గానే జట్టుకు సేవలందించాడు. రుతురాజ్ గైక్వాడ్ ని కూడా బెంచ్‌కే పరిమితం చేశారు.. ఇషాన్ కిషన్‌తో కలిసి గైక్వాడ్ ఆడుతాడని అంతా భావించగా.. టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చింది. అర్ష్‌దీప్ సింగ్ ఫిట్‌గా లేకపోవడంతో శివమ్ మావి అవకాశం అందుకున్నాడు. అయితే రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సిరీస్‌కు ఎంపిక చేసి బెంచ్‌కు పరిమితం చేయడం సరికాదని మండిపడుతున్నారు.

వాటర్ బాటిల్స్ అందించేందుకే రాహుల్ త్రిపాఠిని జట్టులోకి తీసుకుంటున్నారా?, దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మోత మోగించిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనపెట్టడం ఏంటని అని ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్‌పై సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో పూర్తిగా గుజరాత్ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్, శివమ్ మావిలు అరంగేట్రం చేయడం.. గుజరాత్‌ రాష్టానికి చెందిన దీపక్ హుడాలకు జట్టులో అవకాశం ఇవ్వడంపై ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లను పక్కనపెట్టి మరీ గుజరాత్‌ ఆటగాళ్లకు అవకాశాలివ్వ‌డం వెన‌క ఏం న‌డుస్తుంద‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, గత కొంతకాలంగా భారత జట్టులో గుజరాత్ ఆటగాళ్లకు అనవసర ప్రాధాన్యత లభిస్తున్న విష‌యం తెలిసిందే.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News