Telugu Flash News

ఇండియన్‌ పాస్‌పోర్ట్‌తో విదేశీయుడు.. జాతీయ గీతం పాడమంటే ఏం చేశాడంటే..

indian passport

కోయంబత్తూరు ఎయిర్‌పోర్టులో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ విదేశీయుడు ఇండియన్‌ పాస్‌పోర్టు కలిగి ఉండటంతో అధికారులు చాకచక్యంగా గ్రహించి పట్టుకున్నారు. ఎయిర్‌ అరేబియా విమానం షార్జా నుంచి కోయంబత్తూరుకు చేరుకుంది. ఈ విమానం నుంచి దిగిన ఓ ప్రయాణికుడు ఇండియన్‌ పాస్‌పోర్టు చూపించాడు. సాధారణ ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దీన్ని చూసిన అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులకు అనుమానం వచ్చింది.

అతడు భారత పౌరుడు కాదని నిర్ధారించుకున్నారు. వెంటనే అతడి వద్దకు వెళ్లి పక్కకు తీసుకెళ్లి విచారించారు. ఈ సమయంలో అతడు భారతీయుడా కాదా అనే విషయం తేల్చేందుకు ఓ టెస్టు పెట్టారు. దీంతో అతడు తేలిపోయాడు. బిక్కమొహం వేసి అసలు విషయం చెప్పేశాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అనుమానాస్పదంగా కనిపించిన ఆ వ్యక్తి పేరు అన్వర్ హుస్సేన్‌. షార్జాలో ప్రస్తుతం టైలర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఇండియాకు వచ్చిన అతడు.. గత సోమవారం కోయంబత్తూరు ఎయిర్‌పోర్టులో దిగాడు. అన్వర్‌కు తమిళనాడులోని తిరుప్పూర్‌ అడ్రస్‌తో పాస్‌పోర్టు ఉంది. అయితే, ఇది నకిలీది కావడంతో అనుమానం వచ్చి అతడిని పక్కకు రమ్మన్నారు. విచారణలో భాగంగా భారతీయుడివే అని నిరూపించుకొనేందుకు కొన్ని ప్రశ్నలు వేశారు. పొంతన లేని సమాధానాలు ఇస్తుండడంతో చివరకు జాతీయ గీతం పాడమని అధికారులు సూచించారు.

దీంతో అన్వర్‌ బిక్కమొహం వేశాడు. చివరకు అసలు నిజం ఒప్పుకున్నాడు. తన వివరాలు బహిర్గతం చేశాడు. బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌ జిల్లా ప్యారీ గ్రామం తన సొంతూరని చెప్పాడు. 2018లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో కొన్నాళ్లు పని చేసినట్లు తెలిపాడు. ఈ సమయంలోనే అక్కడ లోకల్‌ అడ్రస్‌తో ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్‌ లాంటివి పొందాడు. అనంతరం 2020లో పాస్‌పోర్టు పొందాడు. తర్వాత యూఏఈ వెళ్లాడు. ఇప్పుడు షార్జాలో టైలరింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు. తాజాగా భారత్‌కు వచ్చి పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని ఫారిన్‌ యాక్ట్‌ కింద అభియోగాలు మోపారు అధికారులు.

also read :

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

Viral Video Today : అక్రమ మద్యం కేసులో రామచిలుక అరెస్టు..

Exit mobile version