మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరు మన దేశం పేరు చెబితేనే పూనకలోచినట్టు ఊగిపోతారు. ఎవరైనా మన దేశంలో చిన్న తప్పు ఉందంటే అస్సలు సహించం.రోడ్డెక్కి నినాదాలు చేస్తాం. సోషల్ మీడియాలో రచ్చ చేస్తాం. మేరా భారత్ మహాన్ అంటాం.
అదే వస్తువుల కొనుగోలు విషయానికి వచ్చేసరికి మాత్రం పక్క దేశాలలో తయారయ్యే వస్తువుల వైపే మొగ్గు చూపుతాం. అలాంటి పరాయి దేశాల వస్తువుల పై మనకుండే ప్రేమని ఉపయోగించుకుని కొన్ని కంపెనీలు డబ్బులు చేసుకున్నాయి. ఇప్పుడూ చేసుకుంటున్నాయి.
కొన్ని సంవత్సరాల క్రితం మ్యూనిచ్ పోలో అనే ఒక జర్మన్ బట్టల కంపెనీ కొత్త కొత్త డిజైన్లతో మార్కెట్లోకి వచ్చింది.అలా ప్రారంభం అయిన కొద్ది రోజులలోనే యువతి,యువకుల్లో మంచి ఆదరణ పొందింది.
కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం,అందర్ని ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే ఆ మ్యూనిచ్ పోలో కంపెనీ న్యూ ఢిల్లీలో మొదలైన కంపెనీ. మన భారత దేశ కంపెనీ. కానీ ఆ సంస్థ వాళ్లు మాత్రం ఆ కంపెనీని ఒక జర్మన్ కంపనీ గానే చెప్పుకుంటున్నారు.
ఆఖరికి వాళ్ళ వెబ్సైట్లో కూడా జర్మనీ భాషనే వాడుతున్నారు.వాళ్ళ దేశంలో సొంత కంపెనీని స్థాపించాం అని గర్వంగా చెప్పు కోవాల్సిన వాళ్ళే తమ జాతీయతను దాచేస్తునారు.
ఇదే విధంగా మన దేశానికి చెందిన “డ మిలానో” అనే మరొక సంస్థ తాము ఇటాలియన్ కంపనీ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ఆ కంపనీని ఎంత మంది అడిగినా సరే వాళ్ల దగ్గర సమాధానం లేదు. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది మనకు తెలిసి తెలియని పేర్లే కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే కంపెనీల పేర్లు వింటే ఆశ్చర్యపోతారు.
అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, లూయిస్ ఫిలిప్, వాన్ హ్యూసెన్ ఈ పేర్లు వినే ఉంటారు. ఇవన్నీ మన ఇండియా బ్రాండ్లే. వీటిలో చాలా వరకు పొరుగు దేశాలలో మొదలైనవే కానీ ఆ తరువాత “ఆదిత్య బిర్లా” సంస్థ మధురా ఫ్యాషన్స్ సంస్థ కింద ఈ బ్రాండ్లను కొనుక్కుని తమ సొంతం చేసుకుంది.
అప్పట్నుంచి ఇప్పటి వరకు అవి అన్నీ ఆదిత్య బిర్లాలో ఒక భాగంగానే ఉంటూ వస్తున్నాయి.
పేర్లు పరాయివి సంస్థలు మనవి.మన దేశాన్ని మనమే తక్కువ చూపు చూస్తే ఇంకెవరు పట్టించుకుంటారు. అలా ఉంది మరి మన పరిస్థితి.
also read news :
Moral Stories in telugu : కప్ప రాకుమారుడు
Shriya Saran Latest hot Photoshoot Instagram pics 2022