HomesportsIndia: ఇన్నాళ్ల‌కు పాకిస్తాన్ వ‌ల‌న భార‌త్‌కి ఓ మేలు జరిగింది.. అదేంటో తెలుసా?

India: ఇన్నాళ్ల‌కు పాకిస్తాన్ వ‌ల‌న భార‌త్‌కి ఓ మేలు జరిగింది.. అదేంటో తెలుసా?

Telugu Flash News

India: ప్రస్తుతం పాకిస్తాన్ జ‌ట్టు సొంత గ‌డ్డ‌పై ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పై ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయం సాధించ‌గా, ఆ మ్యాచ్‌లో 15 వందలకు పైగా పరుగులు నమోదయ్యాయి. అయితే సాధార‌ణంగా కొన్ని సార్లు క్రికెట్ లో మన ఆట తీరుతో పాటు ఎదుటి జట్టు ప్రదర్శన పై ర్యాంకు ఆధారపడి ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి చెందిన నేపథ్యంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కు సంబంధించి భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలు మ‌రింత మెరుగ‌య్యాయి అని చెప్పాలి. అందుకు కార‌ణం పాకిస్తాన్ జట్టు టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో ఐదవ స్థానంలో ఉండ‌గా, భారత జట్టు రెండో స్థానంలో ఉంది.

భారత జట్టు తన తదుపరి సిరీస్ లను బంగ్లాదేశ్ , ఆస్ట్రేలియా జట్లతో ఆడుతుంది. భారత జట్టు ఆ సిరీస్ లు గనుక నెగ్గితే పాక్ జట్టు డబ్ల్యూ టీ సీ పైనల్ పోరుకు చేరుకోవడం కష్ట మవుతుంది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే సిరీస్ లో భారత్ 2-0 తేడాతో నెగ్గి, ఆస్ట్రేలియాతో జరిగే సీరిస్ లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోయిన‌ భారత్ రెండో స్థానం లో ఉంటుంది. ఇంగ్లాండ్ తో జరిగే మిగతా మ్యాచ్ ల్లో పాకిస్తాన్ జట్టు ఇదే స్థాయి ప్రదర్శన చేస్తుంది అని ఊహించ‌డం క‌ష్ట‌మే. సొంత గ‌డ్డ‌పై వారు రాణించ‌క‌పోతే ఇండియా అవ‌కాశాలు మెరుగు అవుతాయి.

డబ్ల్యూటీసి ఛాంపియన్షిప్ ను ఇప్పటివరకు కేవలం ఐదు జట్లు మాత్రమే సాధించ‌గా, అందులో ఆస్ట్రేలియా ఎక్కువసార్లు ఈ జాబితాలో ప్రథమ స్థానం లో నిలిచింది. ఆ తర్వాత ఇండియా ఉంది. సౌత్ ఆఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఉన్నాయి. 2001 నుంచి ప్రారంభమైన ఈ చాంపియ‌న్ షిప్ జాబితాలో ఇప్పటివరకు కేవలం ఐదు జట్లు మాత్రమే చోటు సంపాదించ‌గా, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్ ఇంతవరకు బోణీ కొట్టకపోవడం ఆశ్చ‌ర్య‌పోయే విష‌యం అనే చెప్పాలి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News