IND vs AUS Schedule 2023 : శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల పర్యటనలో భాగంగా సిరీస్‌లు గెలుచుకొని జోరుమీదుంది టీమిండియా. ఇక ఆస్ట్రేలియా (Australia) జట్టు ఇండియా (India) లో పర్యటించనుంది. ఈ క్రమంలో ఆసీస్‌ను కూడా ఓడించి తీరాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. కివీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఊపుతో ఆసీస్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటన షురూ కానుంది. ఒకటిన్నర నెల పాటు ఈ పర్యటన సాగనుంది.
పర్యటనలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య 4 టెస్టులు, 3 వన్డేలు జరుగుతాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే తొలి టెస్టుకు నాగపూర్ వేదిక అవుతోంది. ఇక టెస్టుల్లో ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఈ టెస్టు సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంటే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా పట్టుదలతో ఆడాలని నిర్ణయించుకుంది.
ఇక ఐసీసీ వరల్డ్ టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ ప్లేస్‌లో ఉంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కూడా గెలిస్తే.. టెస్టుల్లోనూ అగ్ర పీఠాన్ని కైవసం చేసుకొనే అవకాశం దక్కనుంది.
ఆసీస్, టీమిండియా జట్ల మధ్య మ్యాచ్‌ల షెడ్యూల్ ఎలా ఉందో ఓ లుక్కేయండి..
- తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగపూర్‌లో జరుగుతుంది.
- రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ఢిల్లీలో నిర్వహించనున్నారు.
- ఇక మూడో టెస్టు విషయానికి వస్తే మార్చి 1 నుంచి 5 వరకు ధర్మశాలలో ఉంటుంది.
- ఆఖరిది, నాలుగో టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియంలో నిర్వహిస్తారు.
- మరోవైపు వన్డే షెడ్యూల్లో భాగంగా తొలి వన్డే మార్చి 17న ముంబైలో ఉంటుంది.
- రెండో వన్డే మార్చి 19న ఏపీలోని విశాఖపట్నంలో ఉంటుంది.
- మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగనుంది.
చివరిసారిగా భారత్-ఆసీస్ మధ్య 2020-21లో టెస్టు సిరీస్ జరిగింది. ఇందులో 2-1తో టీమిండియా నెగ్గింది.
also read :
Viral Video : టర్కీలో భూకంపం వచ్చే ముందు పక్షుల అరుపులు చూశారా?
Kim Jong Un: 40 రోజుల నుంచి కనిపించని కిమ్.. ఉత్తరకొరియా అధినేతకు ఏమైంది?