HomesportsInd vs SA: పోరాడి ఓడిన భార‌త్.. తొలి వ‌న్డేలో సౌతాఫ్రిక ఘ‌న విజ‌యం

Ind vs SA: పోరాడి ఓడిన భార‌త్.. తొలి వ‌న్డేలో సౌతాఫ్రిక ఘ‌న విజ‌యం

Telugu Flash News

Ind vs SA: ఇటీవ‌ల సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలుచుకున్న భార‌త్ ఇప్పుడు వ‌న్డే స‌మ‌రానికి సిద్ధమైంది. స్టార్ క్రికెట‌ర్స్‌కి విశ్రాంతి నివ్వ‌గా శిఖ‌ర్ ధావ‌న్ నేతృత్వంలో తొలి వ‌న్డే మ్యాచ్ ఆడింది. ఇందులో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకోలేదనే నిరాశను పక్కన పెట్టి శాంసన్ (86 నాటౌట్) చక్కటి ఇన్నింగ్స్ ఆడి దాదాపు ఇండియా గెలుపుని ద‌గ్గ‌ర వ‌ర‌కు తీసుకెళ్లాడు. కాని 9 ప‌రుగుల తేడాతో అప‌జ‌యం చెందాల్సి వ‌చ్చింది. మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

చెత్త ఫీల్డింగ్..

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేయ‌గా, ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులు విసిరారు. బౌలర్లు మిడిల్‌ ఓవర్లలో పట్టు సడలించ‌డంతో పాటు ఫీల్డింగ్‌ వైఫల్యం వ‌ల‌న‌ టీమిండియా పాలిట శాపమైంది. దీంతో మిల్లర్‌ (75 నాటౌట్‌), క్లాసెన్‌ (74 నాటౌట్‌), డికాక్‌ (48) బౌండరీలతో చెలరేగిపోయి ర‌చ్చ చేశారు. భారత బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్‌, కుల్దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆటగాళ్లు మొత్తం 3 మంచి క్యాచ్‌లను వదిలేశారు. మరి కొందరు మిస్ ఫీల్డింగ్ కారణంగా బౌండరీలు ఇచ్చారు. 9వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ వదిలేయగా, 38వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ క్యాచ్‌లు జారవిడ‌వ‌డంతో మూల్యం చెల్లించుకోవ‌ల‌సి వ‌చ్చింది.

ఇక 250 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియాకు మొద‌ట్లోనే షాక్ త‌గిలింది. యంగ్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (3) రబాడా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. కొద్దిసేపటికే పార్నెల్ బౌలింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (4) కూడా పెవిలియన్‌కు చేరడంతో ఇండియా క‌ష్టాల్లో ప‌డింది. ఇక క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడుతూ కనిపించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (19) షంసీ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఇషాన్‌ కిషన్‌(20)తో కలిసి ఇన్నింగ్స్‌కు చక్కదిద్దే ప్రయత్నం చేసిన‌, 51 పరుగుల వద్ద ఇషాన్‌ ఔటయ్యాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్‌ కూడా భారీషాట్‌కు ప్రయత్నించి రబాడాకు క్యాచ్‌ ఇచ్చి ఔట్ కావ‌డంతో ఇండియా క‌ష్టాల్లో ప‌డింది.. అయితే సంజూ శాంసన్‌ ఒంటరి పోరాటం చేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (33) విలువైన పరుగులు సాధించినా కుల్దీప్‌ యాదవ్‌ (0), ఆవేశ్‌ ఖాన్‌ (3), రవి బిష్ణోయ్‌ (4) పెద్దగా పరుగులేమీ చేయకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News