Inaya: బిగ్ బాస్ కెప్టెన్ కావాలని కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. రేవంత్ రెండు సార్లు కెప్టెన్ కాగా, ఇనయ, రోహిత్ కెప్టెన్ కాలేకపోయారు.. వీళ్లిద్దరూ టాస్క్‌లలో మంచి పెర్ఫామ్ చేసినప్పటికీ ఇంటి సభ్యుల ఏకాభిప్రాయం అనే వరస్ట్ ప్రాసెస్‌లో హౌస్‌కి కెప్టెన్ కాలేకపోయారు.
అయితే బిగ్ బాస్ హౌస్‌లో వచ్చేవారం నుంచి సెమీ ఫైనల్ స్టార్ట్ కాబోతుండంతో.. హౌస్‌కి కెప్టెన్ అవ్వాలంటే ఇది చివరి అవకాశం కావడంతో.. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని హౌస్‌కి చివరి కెప్టెన్ అయ్యింది ఇనయ సుల్తానా. అంతే కాదు సెమీ ఫైనల్స్ కు చేరిన ఫస్ట్ కంటెస్టెంట్ గా కూడా నిలిచింది.
కెప్టెన్సీ టాస్క్‌లో గేమ్ నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరిగా శ్రీసత్య – ఇనయా మిగలగా.. వారిద్దరి మధ్య టఫ్ పోటీ అయితే నడిచింది. వీళ్లిద్దరూ టాస్క్‌లలో మంచి పెర్ఫామ్ ఇవ్వగా, చివరకు కెప్టెన్ అవ్వాలి అని కోరికతో రెచ్చిపోయిన ఇనయ శ్రీసత్యను ఎక్కడికక్కడ నిలువరించి కెప్టెన్ పీఠాన్ని అధిరోహించింది..
ఈవారం కెప్టెన్ అయిన వాళ్లు నేరుగా సెమీ ఫైనల్ వీక్‌లోకి అడుగుపెట్టబోతుండటంతో.. ఇనయ సెమీ ఫైనల్‌కి వెళ్లిపోయినట్టే. మొత్తానికి తన కోరికతో పాటు తన తల్లి కోరికను ఇలా తీర్చింది ఇనయ.
ఫ్యామిలీ ఎపిసోడ్‌లో ఇనయ సుల్తానా తల్లి బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చి.. నువ్ కెప్టెన్ కావాలని కోరింది. ఆమె కోరినట్టుగానే బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది ఇనయ సుల్తానా.
అయితే కెప్టెన్ అవ్వాలనే కోరికతో పాటు.. టైటిల్ గెలిచిరావాలని తన కోరికను ఇనయన తల్లి వెల్లడించింది. ఇక గేమ్ ఎలిమినినేషన్ విషయంలో రేవంత్ కు ఫైమాకు మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది.
రోహిత్ ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయినందకు ఎమోషనల్ అయ్యాడు. ఏడ్చేశాడు.
హౌస్ లో ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తున్న రేవంతో కోసం తన భార్య తో స్క్రీన్ మీద మాట్లాడించారు బిగ్ బాస్. అనంతరం రేవంత్ అమ్మగారు హౌస్ లోకి వచ్చి కాసేపు సందడి చేయగా, అమ్మ, భార్య కోరిక మేరకు రేవంత గడ్డం తీసి .. హ్యాండ్సమ్ గా తయారయ్యాడు.
also read news:
horoscope today : 26 నవంబర్ 2022 ఈ రోజు రాశి ఫలాలు (26/11/2022)
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త! గ్రూప్-4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. ఉత్తర్వులు జారీ