Telugu Flash News

చలికాలంలో ఇమ్యూనిటీ పెంచే 10 అద్భుతమైన పోషకాహార చిట్కాలు

immunity foods in winter

శీతాకాలంలోనూ జలుబు, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఉంటుంది. ఇవి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వారిని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ.  మారుతున్న వాతావరణాన్ని ఎదుర్కోవటానికి, మన శరీర పోషక అవసరాలను తీర్చడానికి, చలికాలంలో మనం ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి సహాయపడే కొన్ని ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో ప్రజలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు. ఇది వారి రోగనిరోధక శక్తిని బాగా తగ్గిస్తుంది. ఫలితంగా జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వైరస్‌లు ఒక వ్యక్తి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తాయి.

చలికాలంలో చల్లని మరియు పొడి గాలి కూడా మన రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ప్రజలు జిహ్వ చాపల్యం కోసం పకోడాలు , సమోసాల వంటివి తింటుంటారు. వీటికి బదులు ఇతరత్రా ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవడం మంచిది.

10 ఆహార మార్పులను పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

చలికాలం కోసం ఆహార చిట్కాలు

1. మీ ఆహారంలో బాజ్రా, రాగి , రాజ్‌గిరా వంటి మిల్లెట్‌లను చేర్చుకోండి. అవి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.

2. పోషకాలు అధికంగా ఉండే ఫుడ్ తీసుకోండి.

3. మీ ఆహారంలో క్యారెట్, బత్తాయి, కంద వంటి రూట్ వెజిటేబుల్స్ చేర్చండి. అవి యాంటీఆక్సిడెంట్లు, కార్టినాయిడ్లతో నిండి ఉంటాయి.

4. మజ్జిగకు బదులుగా పెరుగు తీసుకోండి. ఎందుకంటే ఇది అద్భుతమైన ప్రోబయోటిక్.. వెచ్చని శక్తిని కలిగి ఉంటుంది. వేసవిలో అయితే మజ్జిగ మంచి ఎంపిక.

5. మీ ఆహారంలో బచ్చలికూర, ఉసిరికాయ, బతువా  వంటి ఆకుకూరలను చేర్చుకోండి. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని సెల్యులార్ ప్రక్రియలను నియంత్రిస్తుంది.

6. గోంధ్ లడ్డూలను తీసుకోండి.

7. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి , కడుపులో మంటను తగ్గించడానికి నిద్రవేళకు ముందు పసుపు కలిపిన పాలు తాగండి.

8. త్రిదోషాలను (కఫ, వాత మరియు పిత్త) సమతుల్యం చేయడానికి ఉదయం పూట రాగి గ్లాసులో నీటిని తీసుకోండి.

9. మీ చర్మం మృదువుగా, తేమగా ఉండటానికి హైడ్రేటెడ్ గా ఉండండి.

10. తులసి, ఏలకులు, లవంగం , దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా దినుసులు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

also read :

Bigg Boss 6: హౌజ్‌లోకి సోహైల్.. సిరి, శ్రీహాన్ మ‌ధ్య చిచ్చు పెట్టి క‌థ మొత్తం మార్చేశాడుగా..!

మెంతికూర నువ్వుల పచ్చడి.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..

 

Exit mobile version