HomehealthImmunity Foods: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఈ ఆహారాలు ట్రై చేయండి.. విటమిన్‌ సీ లభించే ఫుడ్స్‌ ఇవే!

Immunity Foods: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఈ ఆహారాలు ట్రై చేయండి.. విటమిన్‌ సీ లభించే ఫుడ్స్‌ ఇవే!

Telugu Flash News

Immunity Foods : దేశంలో మళ్లీ కరోనా భయం మొదలైంది. చైనాలో కోవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాల్లోనూ ఈ భయాందోళన పెరుగుతోంది. ఫోర్త్‌ వేవ్‌ వచ్చేస్తోందంటూ భారత్‌లో అప్పుడే మీడియా ఛానళ్లలో హోరెత్తిస్తున్నారు. అయితే, వాస్తవంగా కరోనా వ్యాప్తికంటే.. కరోనా వ్యాపిస్తోందన్న పుకార్లు, వార్తలే వేగంగా స్ప్రెడ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దేశంలో కరోనా భయంతో ప్రస్తుతం అందరూ ఇమ్యూనిటీ పవర్‌ పెంచుకొనేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఏ ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది తెలుసుకోవాలి. ఎవరిలో అయితే విటమిన్‌ సీ తక్కువగా ఉంటుందో వారికి రోగాలు, వైరస్‌లు త్వరగా వ్యాపిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. విటమిన్‌ సీని పెంచుకోవడానికి పలు ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత కరోనా భయం నేపథ్యంలో ఇలాంటి ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బలపపడుతుంది.

కేవలం మందులతోనే కాదు.. తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్ట్‌ అవ్వడానికి విటమిన్‌ సీ ముఖ్యం. ఇది దానిమ్మ, బత్తాయి, నిమ్మ, నారింజ పండ్లలో అధికంగా ఉంటుంది. ఇక విటమిన్లు అధికంగా ఉండే టమాటా, బంగాళాదుంపలు లాంటివి తీసుకోవడం వల్ల వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వారానికోసారి అయినా ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి.

చేపలు తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్‌..

మన బాడీలో యాంటీబాడీస్‌ను డెవలప్‌ చేసుకోవాలంటే పాలు, గుట్లు, పెరుగు, బీన్స్‌ తీసుకోవాలి. ఇక ప్రతి రోజూ క్యారెట్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో కెరోటిన్‌ లభిస్తుంది. యాంటీ బాడీ కణాల ఉత్పత్తికి క్యారెట్‌ ఉపయోగపడుతుంది. రోజూ ఖర్జూర తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది. ఖర్జూరాల్లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. రక్తహీనతను రాకుండా చేస్తుంది. గ్రీన్‌ టీ తాగడం వల్ల శరీరంలో రక్తకణాలను ఉత్తేజపరుస్తుంది. మరోవైపు మాంసాహారాల్లో చేపలు, పీతలు లాంటివి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News