Homesportsvirender sehwag turns 44: వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా?

virender sehwag turns 44: వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా?

Telugu Flash News

భార‌త్ క్రికెట్ లో వీరేంద్ర సెహ్వాగ్ (virender sehwag) ఓ సంచ‌ల‌నం. తన మెరుపు బ్యాటింగ్ తో కోట్లాది మంది అభిమానులను ఎంత‌గానో అల‌రించాడు. 90వ దశకంలో పుట్టిన పిల్లలకు సెహ్వాగ్ అంటే ప్రత్యేకమైన క్రేజ్. స‌చిన్‌ని సైతం బీట్ చేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకున్నాడు.

44వ పడిలోకి నజాఫ్‌గఢ్ నవాబ్..(Happy birthday Virender Sehwag)

భారత క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ గా గుర్తింపు పొందిన సెహ్వాగ్ ఈ రోజు 44వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

1978 అక్టోబర్ 20న హర్యానాలో జన్మించిన సెహ్వాగ్.. చిన్నప్పట్నుంచే క్రికెట్ తో ప్రేమలో పడ్డాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ని ఎంగానో అభిమానించే ఆయ‌న తన అభిమాన క్రికెటర్ లాగే ఎద‌గాల‌ని అనుకున్న‌నాడు . సచిన్ మాదిరే చిన్న వయసులోనే బ్యాట్ పట్టుకున్నాడు.

క్రికెట్ బ్యాట్ ప‌ట్టొద్ద‌ని తండ్రి వార్నింగ్

ఇక 12 ఏండ్ల వయసులో క్రికెట్ ఆడుతుండగా బంతి బలంగా తాకడంతో సెహ్వాగ్ పన్ను విరిగింది. ఆ స‌మ‌యంలో తండ్రి మ‌రోసారి క్రికెట్ బ్యాట్ ప‌ట్టొద్ద‌ని వార్నింగ్ ఇచ్చిన త‌ల్లి ప్రోత్సాహం వ‌ల‌న మెల్ల‌మెల్ల‌గా క్రికెట్ వైపు అడుగులు వేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి సెహ్వాగ్ అడుగుపెట్టిన తర్వాత చాలా మంది ఈయ‌న‌ని చూసి స‌చిన్ అని క‌న్ఫ్యూజ్ అయ్యేవారు. అలానే షాట్స్ ఉండేవి, దాదాపు బ్యాటింగ్ స్టైల్ కూడా సేమ్ ఉండేది.. స‌చిన్, సెహ్వాగ్ క‌లిసి బ్యాటింగ్ చేస్తున్నారంటే బౌల‌ర్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తవి. ఇక కొన్ని విష‌యాల‌లో సెహ్వాగ్ త‌న అభిమాన క్రికెట‌ర్‌ని బీట్ చేశాడు. వ‌న్డేల‌లో సచిన్ టెండూల్కర్ 200 నాటౌట్ చేస్తే సెహ్వాగ్ 219 పరుగులు చేశాడు, ఇక వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్‌ల‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. స‌చిన్ ఆ ఘ‌న‌తని అందుకోలేక‌పోయాడు.

ముల్తాన్ కా సుల్తాన్

ఇక అంపైర్‌ని బెదిరించాడ‌ని సెహ్వాగ్‌పై ఒక టెస్ట్ నిషేదం విధించారు. ఇది అత‌ని రెండో టెస్ట్ లోనే జ‌రిగింది. ఇక ఏప్రిల్ 2004లో ముల్తాన్‌లో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో 309 పరుగులు చేసి టీమ్ ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ తేడాతో గెలవడంలో కీల‌క పాత్ర పోషించాడు సెహ్వాగ్. అప్ప‌టి నుండి అతను ముల్తాన్ కా సుల్తాన్ గా పిల‌వ‌బ‌డుతున్నాడు. ఇక ప్రపంచంలోనే నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్‌మెన్ గా కూడా గుర్తింపు పొండాడు. మార్చి 2009లో, వీరేంద్ర సెహ్వాగ్ న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేసి, వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. ఆ తర్వాత అతని రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

-Advertisement-

2006లో ఇండియన్ ఆయిల్ కప్ ఫైనల్‌లో సెహ్వాగ్ ఒక ఓవర్‌లో ఆరు బౌండరీలు కూడా కొట్టాడు. ఇక మ‌ధ్య‌లో ఫామ్ కోల్పోవ‌డం వ‌ల‌న ఏడాది పాటు భార‌త టెస్ట్ క్రికెట్కి దూరంగా ఉన్నాడు. 2007లో ఊహించని విధంగా పునరాగమనం చేసాడు. సెహ్వాగ్ అడిలైడ్‌లో తన రెండవ ఇన్నింగ్స్‌లో 151 పరుగులు చేశాడు . ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను గెలిపించడంలో సెహ్వాగ్ కీల‌క పాత్ర పోషించాడు సెహ్వాగ్.. 1999 లో పాకిస్థాన్ తో వన్డే మ్యాచ్ సందర్భంగా భారత జట్టుకు అరంగ్రేటం చేశాడు. 2001లో సౌత్ ఆఫ్రికాతో టెస్టు జట్టులోకి వచ్చాడు.

వీరేంద్ర సెహ్వాగ్ (virender sehwag) క్రికెట్ కెరీర్

virender sehwag టెస్టు కెరీర్ లో మొత్తం 104 టెస్టులు, 251 వన్డేలు, 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడిన వీరూ.. మొత్తంగా 17 వేల పరుగులు చేశాడు. భారత్ తరఫున అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు సొంతం చేసుకున్న వారిలో సచిన్, గంగూలీ తర్వాత సెహ్వాగ్ ఉన్నాడు. వీరూ.. 31 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవ‌డం విశేషం. అంతర్జాతీయ కెరీర్ లో సెహ్వాగ్ 104 టెస్టులాడ‌గా, ఇందులో 8586 ప‌రుగులు చేశాడు. ఇక వన్డేలలో 8273 పరుగులు చేశాడు. వన్డేలలో 96 వికెట్లు, టెస్టులలో 40 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో ఢిల్లీ, పంజాబ్ తరఫున ఆడిన సెహ్వాగ్.. 104 మ్యాచ్ లలో 2,728 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 155.4 గా ఉంది.

బ్యాటింగ్ చేస్తూ కూడా పాటలు పాడుతూ

virender sehwag సెహ్వాగ్‌కి హిందీ పాటలు వినే అలవాటుంది. కిషోర్ కుమార్ పాటలంటే చెవి కోసుకుంటాడు. బ్యాటింగ్ చేస్తూ కూడా పాటలు పాడేవాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వీరూకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు ఆర్యవీర్. రెండో కొడుకు వేదాంత్. పిల్లలంటే వీరూకు చాలా ప్రేమ. గ్రౌండ్ లో ప్రత్యర్థుల బంతులను చీల్చి చెండాడే సెహ్వాగ్.. సోషల్ మీడియాలో కూడా అదే రీతిలో పోస్టులు పెడుతూ హాట్ టాపిక్‌గా మారుతుంటాడు.

ఇవి కూడా చూడండి :
తీయని పాట మీ గొంతులో పలకాలంటే… ఇలా చేయండి.

రాత్రిపూట తలస్నానం చేస్తే..నష్టమా ? లాభమా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News