HometelanganaTelangana New CS : తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి.. ఆమె ప్రొఫైల్‌ తెలుసా?

Telangana New CS : తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి.. ఆమె ప్రొఫైల్‌ తెలుసా?

Telugu Flash News

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌ (Telangana New CS) గా శాంతికుమారి నియమితులయ్యారు. ఇంతకు ముందు సీఎస్‌గా ఉన్న సోమేష్‌ కుమార్‌ను ఏపీ క్యాడర్‌కు వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తక్షణమే ఆ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీంతో కొత్త సీఎస్‌ను నియమించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీనియర్‌ మంత్రులు, అధికారులతో సమాలోచనలు చేశారు. అనంతరం ఇద్దరు సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి.

ఇందులో సీనియర్‌ ఐఏఎస్‌లు అయిన శాంతికుమారి, రామకృష్ణారావు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారివైపే సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపారు. అంతుకుముందు సీఎంవో పిలుపుతో వీరిద్దరూ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఈరోజు మధ్యాహ్నం కొత్త సీఎస్‌ పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి.. ప్రస్తుతం తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె వైద్య, ఆరోగ్య శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్‌ మంత్రిగా పని చేసిన సమయంలోనే మెదక్‌ కలెక్టర్‌గా పని చేశారు శాంతికుమారి. తాజగా సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు శాంతి కుమారి. అనంతరం శాంతికుమారికి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

cs shanthi kumari ias meets cm kcr

ఇంకా రెండేళ్ల సర్వీసు..

సీఎస్‌గా శాంతి కుమారి 2025 వరకు కొనసాగనున్నారు. ఎమ్మెస్సీ మెరైన్‌ బయాలజీ చదివిన ఆమె.. యూఎస్‌లో ఎంబీఏ చదివారు. 30 ఏళ్లుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలనతోపాటు అనేక శాఖల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో రెండు సంవత్సరాల పాటు పని చేశారు శాంతి కుమారి. నాలుగేళ్ల పాటు సీఎంవోలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, టీఎస్‌ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్‌ సెల్‌ ప్రత్యేక సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. తనకు సీఎస్‌గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు శాంతి కుమారి. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా ఉన్నాయని కొత్త సీఎస్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినందుకు గర్వంగా, సంతోషంగా ఉందని చెప్పారు.

Also Read:

-Advertisement-

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ ఇంట విషాదం… బాధ‌లోను అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్

అయోధ్యలో రామ మందిరాన్ని చూడడానికి జటాయువు వచ్చిందా? స్థానికులకు కనిపించిన ఆ వింత పెద్ద పక్షి ఏంటి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News