Telugu Flash News

పై చదువుల కోసం అమెరికా వెళ్లే వారిలో హైదరాబాదీ స్టూడెంట్లదే హవా.. ఎంత మంది వెళ్తున్నారంటే..!

Higher education in the United States

ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా (Higher education in the United States) వెళ్లే వారిలో హైదరాబాదీ (hyderabad) లదే అగ్రస్థానమని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి అమెరికా వెళ్తున్న విద్యార్థుల్లో భారతీయులే అధికంగా ఉంటున్నారు. మరోవైపు ఇందులో కూడా హైదరాబాద్‌ స్టూడెంట్లే అధ్యధికంగా ఉంటున్నారని తేలింది. అగ్రరాజ్యానికి వెళ్లేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్న భారతీయుల్లో 30 శాతం మంది హైదరాబాద్‌కు చెందిన వారు ఉండటం విశేషం.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ తాజాగా ప్రచురించిన ఓపెన్‌ డోర్స్‌ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఉన్నత విద్య కోసం విద్యార్థులను యూఎస్‌కు పంపే నగరాల్లో హైదరాబాద్‌ భారతీయ నగరాల్లో టాప్‌లో ఉందని ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. ముగిసిన అకడమిక్‌ ఇయర్‌ అంటే 2021-22లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదవడం కోసం వివిధ దేశాల నుంచి 2.61 లక్షల మంది అమెరికన్‌ వర్సిటీల్లో కొత్తగా నమోదు చేసుకున్నారు.

ఓపెన్‌ డోర్స్‌ నివేదికలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. అగ్రరాజ్యంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్తున్న వారిలో 75 వేల మంది ఇండియన్‌ స్టూడెంట్లే వీసాలు పొందారు. అయితే, ఇందులోనూ సుమారు 22 వేలమందికిపైగా హైదరాబాద్‌ స్టూడెంట్లు ఉండటం విశేషం. అంటే సుమారు 30 శాతం మంది హైదరాబాదీలు ఉన్నారు. హైదరాబాద్‌ తర్వాతి స్థానాల్లో ముంబై, ఢిల్లీ నగరాలు ఉన్నాయి.

అమెరికాలో కొన్ని కోర్సులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌, రోబోటిక్స్‌ లాంటి కోర్సులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. కంప్యూటర్‌ కోర్సులతో పాటు బిజినెస్‌, సోషల్‌ సైన్స్‌ కోర్సుల్లోనూ స్టూడెంట్లు చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారని స్పష్టమవుతోంది.

19 శాతం ఇండియన్‌ స్టూడెంట్లే..

అమెరికాలో చదివే ఫారిన్‌ స్టూడెంట్ల సంఖ్య మొత్తం 10 లక్షల మంది కాగా, ఇందులో భారతీయుల సంఖ్య 19 శాతం పెరిగిందని తేలింది. మరో ఆసక్తికర విషయం కూడా ఓపెన్‌డోర్స్‌ నివేదిక వెల్లడించింది. అమెరికాకు వెళ్లే విదేశీయుల సంఖ్యలో అగ్రస్థానం గతంలో చైనీయులదే. అయితే, కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. పలు ఆంక్షలు విధించడంతో చైనీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ స్థానం ఇప్పుడు భారతీయులు ఆక్రమించారు.

also read news:

Rashmi Gautam: ఆపు నీ వేషాలు అంటూ ర‌ష్మీపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. అంత త‌ప్పు ఏం చేసింది..!

Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..

Exit mobile version