Hyderabad Traffic : హైదరాబాద్ నగరంలో రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. సాధారణంగానే భాగ్యనగరంలో కాస్త ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. కానీ.. ఈరోజు ఎక్కడ చూసినా అష్టదిగ్బంధనం అయ్యింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అరకిలోమీటరు దూరం వెళ్లాలన్నా సుమారు గంట సమయం పట్టేంతగా వెహికల్స్ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసలింతకీ ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ కూడలి ఎళ్లవేళలా ట్రాఫిక్‌తో నిండిపోయి కనిపిస్తుంది. అది ఈరోజు పద్మవ్యూహంలా కనిపించింది. గంటలకొద్దీ వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై ఈనెల 11న ఫార్ములా రేసింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లే ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌తో పాటు ఇతర మార్గాలను మూసేశారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇక అక్కడే స్టాప్ అయిపోయిందా అన్నట్లు పరిస్థితి మారిపోయింది.
ఫార్ములా రేసింగ్ ఏర్పాట్లతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడంతో నాంపల్లి, గాంధీ భవన్, మార్గాల్లో ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో ఇక అటువైపు వెళ్లిన వాహనదారులు ఇరుక్కుపోయారు. ఖైరతాబాద్ ప్రాంతంలో బస్తీల నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లాలంటే రైల్వే గేటు దాటాలి.
ఈ గేటు సమీపంలో నివాసం ఉండే వారు మింట్‌కాంపౌండ్, నెక్లెస్ రోటరీ, ఫ్లైఓవర్ మీదుగా వెళ్తూఉంటారు. మింట్‌కాంపౌండ్ దారిని సచివాలయం కోసం రోడ్డు వేస్తూ కొన్నాళ్లుగా బంద్ చేశారు. మరోవైపు ఐమ్యాక్స్ దారి కూడా మూసేయడంతో ఇక నగరవాసులకు నరకంగా మారింది.
కూకట్ పల్లి నుంచి ఎంజీబీఎస్ వెళ్లే మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పంజాగుట్ట నుంచి అబిడ్స్ వెళ్లేందుకు మామూలు రోజుల్లో పావు గంట పడితే ఈరోజు గంట పట్టింది.
దీనికితోడు షాదన్ కాలేజీ వద్ద యూటర్న్ కూడా మూసేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ప్రభావంతో మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంకు తదితర ప్రాంతాల్లో కూడా భారీ ట్రాఫిక్ కనిపించింది.
రేతిబౌలి నుంచి సోమాజిగూడ వెళ్లేందుకు సుమారు గంటన్నర నుంచి రెండు గంటల వరకు సమయం పట్టింది. ఐమ్యాక్స్‌లో సినిమాలు బంద్ చేశారు. లుంబినిపార్క్ మూసేశారు. ట్రాఫిక్ నియంత్రణకు తక్షణం చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.
సిటీ మద్యలో ఈ పనికి రాని రేసులు పెడితే,
పనులల్లకి పోయే పబ్లిక్ ఇబ్బంది పడరా ??ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు @KTRBRS గారు?#FormulaE #HyderabadEPrix @FIAFormulaE pic.twitter.com/wpg3LISPHO
— Erri Gulabi (@ErriGulabi) February 8, 2023
also read:
Hyper Aadi: శృతి మించుతున్న హైపర్ ఆది బూతు కామెడీ..
Waltair Veerayya: ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. ఎప్పుడంటే ?