HomerecipesDry Fruit Cake : డ్రై ఫ్రూట్‌ కేక్‌ తయారు చేయండిలా.. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టరు

Dry Fruit Cake : డ్రై ఫ్రూట్‌ కేక్‌ తయారు చేయండిలా.. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టరు

Telugu Flash News

Dry Fruit Cake : కేక్ అంటే ఎవరికైనా ఇష్టమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు  లాగించేస్తారు. ఇక పిల్లలైతే అయిపోయాదాకా వదిలిపెట్టరు. బర్త్ డే  అయిన, పెళ్లి రోజు అయిన,వేరే ఏ ఫంక్షన్ కైనా ఒక పసందైన కేక్ కావాల్సిందే.  అలాంటిది బయట నుండి ఏ zomato , swiggy లోనో ఆర్డర్ ఇవ్వకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది. కాస్త శ్రమ అయినా కూడా మనమే చేసుకుంటే అదో తృప్తి.  ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపి  Dry Fruit cake. ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Dry Fruit Cake కావాల్సిన పదార్థాలు :

జీడిపప్పు – 1/4 కప్పు, బాదం ముక్కలు – 1/4 కప్పు, పిస్తా – 1/4 కప్పు, వాల్‌నట్‌లు – 1/4 కప్పు, టుట్టీ ఫ్రూటీ – 1/2 కప్పు, ఎండుద్రాక్ష – 1/4 కప్పు, గుడ్లు – 5, వెన్న – 3/4 కప్పు, పంచదార – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా, వెనీలా ఎసెన్స్ – ఒక టేబుల్ స్పూన్, మైదా – రెండు కప్పులు, బేకింగ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి – ఒక టీస్పూన్, జాజికాయ పొడి – పావు టీస్పూన్, బీటర్, మైదా పొడి కొంచెం.

తయారుచేసే విధానం:

ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్‌లను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద వెడల్పాటి బాణలి పెట్టి జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లను వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో మైదా తీసుకుని అందులో బేకింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పు, యాలకుల పొడి, జాజికాయ పొడి, ఎండుద్రాక్ష, టుటీ ఫ్రూటీ, పిస్తాపప్పులు, వేయించిన జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ వేసి బాగా కలపాలి.

తర్వాత రెండు చిన్న గిన్నెలు తీసుకుని వాటిలో గుడ్లు కొట్టి ఒకదానిలో తెల్లసొన, మరొక దానిలో పచ్చసొన వేయాలి. మరో గిన్నెలో వెన్న తీసుకుని అందులో పంచదార వేసి బీటర్‌తో కలపాలి.

ఇప్పుడు గుడ్డులోని పచ్చసొనను కొద్దిగా వేసి బీటర్‌తో కలపాలి. తర్వాత వెనీలా ఎసెన్స్ వేసి మళ్లీ కలపాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని క్రీమ్‌లో కొద్దికొద్దిగా ఉంచి చెంచాతో కలపాలి. గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నె తీసుకొని దానిని బీటర్‌తో హై స్పీడ్‌లో కలపండి.

-Advertisement-

ఇలా చేయడం వల్ల గుడ్డులోని తెల్లసొన నురుగు వస్తుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ మరియు క్రీమ్ మిశ్రమంలో కొద్దిగా కలపాలి. సిద్ధంగా ఉన్న కేక్ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.

ఒక కేక్ పాన్ తీసుకొని వెన్నతో గ్రీజు వేసి పొడి పిండితో చల్లుకోండి. తర్వాత కేక్ మిశ్రమాన్ని వేసి గాలి బుడగలు లేకుండా సమంగా కలపాలి. అరగంట పాటు 350 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు వేడిచేసిన ఓవెన్‌లో బేక్ చేయండి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి.

మరిన్ని వార్తలు చదవండి :

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం.. ఎప్పుడంటే ?

Healthy Winter Recipes : ఈ క్యారట్ సూప్ రుచికి మీరు ఆహా అనాల్సిందే…

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News