Wednesday, May 15, 2024
HomerecipesHealthy Winter Recipes : ఈ క్యారట్ సూప్ రుచికి మీరు ఆహా అనాల్సిందే…

Healthy Winter Recipes : ఈ క్యారట్ సూప్ రుచికి మీరు ఆహా అనాల్సిందే…

Telugu Flash News

క్యారెట్‌లు ఎందులోనైనా ఎలా వాడుకోవచ్చు ఇవి సలాడ్స్ లోను, బిర్యానీ వంటి దేశీయ వంటకాలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ గా చేసుకుని తాగచ్చు, వీటిలో ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్లతో కలిపి ఉంటాయి, ఇవి శరీర కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి, వీటిని తినడం వల్ల మీ కంటి చూపు మెరుగుపడుతుంది, రోగనిరోధక పనితీరు మరియు జీర్ణ ఆరోగ్యాన్ని పెంచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను క్యారట్ అందిస్తుంది. ఇంకా ఏమిటంటే, శీతాకాలంలో ఇవి పుష్కలంగా లభిస్తాయి.

ఈ శీతాకాలంలో క్యారట్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు క్యారెట్‌ను పచ్చిగా తినగలగడం లేదా వాటిని కడిగి, తొక్క తీసి, వాటిని స్నాక్స్‌లో లేదా సలాడ్‌లలో చేర్చచ్చు. లేదా ఈ అద్భుతమైన క్యారట్ సూప్ ను ప్రయత్నించచ్చు. క్రిందన ఇచ్చిన రెసిపీ ప్రకారం చేస్తే ఈ చలికాలంలో వేడివేడిగా క్యారట్ సూప్ తీసుకోవచ్చు.

కావాల్సినవి మరియు చేసే విధానం:

ప్రెషర్ కుక్కర్‌లో తరిగిన క్యారెట్లు మరియు సొరకాయ వేసి, 2 కప్పుల నీరు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

దానిని చల్లబరచాక బాగా కలపాలి కావలసినట్టుగా నీటిని వేయచ్చు.

ఉప్పు, మిరియాలు మరియు జాజికాయ కూడా వేశాక 1/2 టీస్పూన్ నెయ్యి వేసి, తరిగిన కొత్తిమీర పైన వేసి వేడిగా సూప్ తీసుకోవచ్చు.

పోషకాహారాన్ని పెంచడానికి మీరు కొన్ని తరిగిన పార్స్లీ మరియు గుమ్మడికాయ గింజలను కూడా వేయచ్చు.

-Advertisement-

ఈ సూప్ గురించి నిపుణులు మాట్లాడుతూ “క్యారెట్‌లో విటమిన్ ఎ ఫైబర్ బీటా-కెరోటిన్ మరియు ఆంథోసైనింగ్ పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మాములుగా మెరిసే చర్మం కోసం లేదా మెరుగైన కంటి చూపు కోసం క్యారట్ తీసుకుంటుంటే ఇలా ఈ రూపంలో కూడా తీసుకోవడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది”

అయితే ఆరోగ్యానికి మంచిదని అధికంగా క్యారట్ ను తీసుకోవడం వలన శరీరానికి హాని జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

Hansika Motwani And Sohael Khaturiya’s Wedding Photos and Videos

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాలు:

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News