ఈ రోజు మనం చేయబోయే వంట క్యారెట్ క్యాప్సికం రైస్ (carrot capsicum rice) .. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు.. మరి లేటేందుకు స్టార్ట్ చేద్దామా..
క్యారెట్ క్యాప్సికం రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
- రైస్ – 400 గ్రా
- నూనె – 4 టేబుల్ స్పూన్స్
- ఆవాలు – 1/4 టీ స్పూన్
- జీలకర్ర – 1/4 టీ స్పూన్
- పసుపు – చిటికెడు
- సన్నగా తరిగిన క్యాప్సికం – 1 కప్పు
- తురిమిన క్యారెట్ -1 కప్పు
- ఉప్పు – తగినంత
- ఎండుమిర్చి,సెనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, కొద్దిగా ఇంగువ,ధనియాలు, వేయించిన పొడి – 1టీ స్పూన్
- కరివేపాకు – 2 రెమ్మలు
- నిమ్మరసం -1 టీ స్పూన్
- కొత్తిమీర – కొద్దిగా
క్యారెట్ క్యాప్సికం రైస్ తయారు చేయు విధానం
ముందుగా బియ్యం కడిగి కాసేపు నానబెట్టాలి. తర్వాత తగినంత ఉప్పు,నీరు పోసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండి లోతుగా ఉన్న బాణీలు నూనె పోసి వేడి అయిన తర్వాత ఆవాలు వేయాలి. ఆ తర్వాత జీలకర్ర, పసుపు, క్యాప్సికం మొక్కలు, తురిమిన క్యారెట్ కరివేపాకు అన్నీ వేసి బాగా కలపాలి. మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. మూత తీసి గరిటతో ఒక్కసారి తిప్పాలి. పప్పుల పొడి,ఉప్పు వేసి ఒకసారి తిప్పి ఈ మొత్తం మిశ్రమాన్ని వండి ఉంచిన అన్నంలో కలపాలి. చివరగా నిమ్మరసం కొత్తిమీర చల్లితే వెరైటీ రెడీ.దీని పెరుగుతోకాని, కూరగాయల ముక్కల్ని కలిపి చేసిన సలాడ్ తో తింటే బాగుంటుంది.