capsicum tomato curry (క్యాప్సికమ్ టమోటాకూర) :
- క్యాప్సికమ్ (తరిగినవి) : 2 కప్పులు
- టమోటాలు : 1 కప్పు(తరిగినవి)
- ఉల్లిపాయ ముక్కలు : 1 కప్పు
- పచ్చిమిర్చి : 2
- అల్లం, వెల్లుల్లి పేస్టు : 1 టీ స్పూను
- జీడిపప్పు పేస్టు :1 టీ స్పూను
- మీగడ : 1 టీ స్పూను
- కస్తూరిమేతి : 1 టీ స్పూను
- గసగసాలపొడి : 1 టీ స్పూను
- నూనె : 50 గ్రా.
- పసుపు : కొద్దిగా
- కొత్తిమీర : 1 కట్ట
- దాల్చిన చెక్క : 2
- మరాఠీ మొగ్గ : 2 ముక్కలు
- ఉప్పు, కారం : తగినంత
capsicum tomato curry తయారీ : ముందుగా రవ్వంత నూనె వేసి కాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక దానిలో దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి, టమోటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి మగ్గపెట్టాలి. తర్వాత వేయించుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి అయిదు నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు గసగసాల పొడి, జీడిపప్పు పేస్టు, కస్తూరి మేతి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి మరో అయిదు నిముషాలు మగ్గపెట్టాలి. చివరగా కొత్తిమీర, మీగడ వేసి రెండు నిముషాలు ఉడికించి దించుకోవాలి.
పూరీల్లోకి, చపాతీలోకి ఈ కూర చాలా బాగుంటుంది.
also read :
Khajuraho Temples : శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో గురించి తెలుసుకోండి
Horoscope (12-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Adipurush: ఆదిపురుష్ చిత్రాన్ని వదలని వివాదాలు.. తాజాగా కొత్త వివాదం ఏంటంటే..!