Homerecipesమలబార్ మీన్ బిర్యానీ.. ఒక్కసారి తిన్నారంటే ఇక మర్చిపోరు

మలబార్ మీన్ బిర్యానీ.. ఒక్కసారి తిన్నారంటే ఇక మర్చిపోరు

Telugu Flash News

మలబార్ మీన్ బిర్యానీ 

బాస్మతి బియ్యం    : 3 కప్పులు
నీళ్ళు            : 5 1/2 కప్పులు
ఉల్లిపాయలు    : 2
నెయ్యి          : 2 1/2 టీ స్పూన్లు
పులావ్ ఆకులు    :2
సోంపు            : 1/2 టీ స్పూను
యాలకులపొడి    : 1/2 టీ స్పూను
లవంగాలు        : 4
జాపత్రి            :2
దాల్చిన చెక్క      : చిన్న ముక్క
మిరియాల పొడి    : 1 టీ స్పూను
నిమ్మరసం        : 1/2 టీ స్పూను
ఉప్పు తగినంత

ఫిష్ మసాలా కోసం..

చేపముక్కలు       : అరకిలో
నెయ్యి               : 3 చెంచాలు
కొబ్బరి పాలు       : 1/4 కప్పు
పసుపు               : 1/2 టీ స్పూను
కారం                 :1 టీ స్పూను
మిరియాలపొడి     :1/2 టీ స్పూను
నూనె                : 100మి.లీ.
ఉప్పు                : 1 టీ స్పూను
ఉల్లిపాయ          : 1
అల్లం వెల్లుల్లి పేస్టు :  1 టీ స్పూను
టొమోటాలు : 2
కొత్తిమీర పేస్టు       : 1టీ స్పూను
పచ్చిమిర్చి పేస్టు   : 1 టీ స్పూను
పెరుగు                : 1 టీ స్పూను
గరంమసాలా        : 1 టీ స్పూను
నిమ్మరసం           : 1 టీ స్పూను

మలబార్ మీన్ బిర్యానీ తయారీ : బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఐదు నిముషాలు అలా ఉంచి తరువాత నీళ్ళు ఒంపేసి ఉప్పు వేసి హాఫ్ బాయిల్ చెయ్యాలి. బాణలిలో నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు, జాపత్రి, పులావ్ ఆకు, సోంపు, దాల్చినచెక్క యాలకులు, మిరియాల పొడి వేయాలి. ఉల్లిపాయలు ముక్కలు క్రింద తరిగి అందులో వేసి ఎరుపురంగు వచ్చే వరకూ వేయించు కోవాలి. తరువాత ప్రక్కన పెట్టిన అన్నం, నిమ్మరసం వేయాలి. ఐదునిముషాల తర్వాత కొలత ప్రకారం నీళ్ళు పోయాలి. బాగా ఉడికిన తర్వాత దించుకొని పక్కన పెట్టు కోవాలి. ఇప్పుడు చేపముక్కలకు ముళ్ళు తీసేసి పసుపు, కారం, మిరియాలపొడి, ఉప్పు కలిపి అరగంట ఉంచాలి. తరువాత వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఉల్లిపాయ, టమోటా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి వేగాక ఈ ఉల్లిపాయ, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. సన్నని మంట మీద వేయించాలి. అవియేగాక కొబ్బరిపాలు, పెరుగు, ఉప్పు వేసి మరో అయిదు నిముషాలు ఉంచాలి. తర్వాత చేపముక్కలు వేసి సన్నని మంట మీద మిశ్రమం చిక్క బడే వరకూ ఉడికించాలి. లోతుగా ఉన్న ఓ గిన్నెను తీసుకొని అందులో సగం అన్నం వేయాలి. దాని పైన ఫిష్ మసాలా వేయాలి. పైన రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టాలి. ఆవిరి బయటికి రాకుండా మైదాపిండి ముద్దతో అంచులను మూసెయ్యాలి. అలా సన్నని మంట మీద పదినిముషాలు మగ్గనిచ్చి దించుకోవాలి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News