Sunday, April 28, 2024
HomehoroscopeHoroscope Today Telugu (27-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope Today Telugu (27-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 27th March 2024: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Aries horoscope

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగ్రా ఉంటుంది. బంధువర్గంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి రాజకీయ పరిచయాలు కూడా ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వినే అవ‌కాశం ఉంది.. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది..

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Taurus horoscope

ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఆశాభావంతో ఉన్న ఒక పెళ్లి సంబంధం నిరుత్సాహం కలిగించే అవ‌కాశం ఉంది. కళాకారులకు, రియల్ ఎస్టేట్ వారికి, ఐటీ వారికి సమయం అనుకూలంగా ఉంటుందిది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కే అవ‌కాశం ఉంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Gemini

ఈ రాశి వారికి తోబుట్టువుల వల్ల విభేదాలు తలెత్తుతాయి. కుటుంబ పరంగా ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడే అవ‌కాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవ‌కాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొంత నిరుత్సాహం కలిగిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Cancer horoscope

ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకు వెళతారు. అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. బంధు వర్గంలో మీ మాటకు విలువ పెరిగే ఛాన్స్ ఉంది. ఆధ్యాత్మిక చింతన క్ర‌మంగా పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు ఎక్కువ‌గా చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Leo

ఈ రాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి తీపి కబురు అందే ఛాన్స్ ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రేమలు క్ర‌మేపి ఫలిస్తాయి.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Virgo

ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ నాయకులకు సమయం అన్ని విధాలుగాను బాగుంటుంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పరిస్థితి నిలకడగానే ఉంటుంది. స్నేహితుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Libra horoscope

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందే ఛాన్స్ ఉంది. రుణ సమస్యలను చాలా వరకు తగ్గించుకుంటారు. పెళ్లి సంబంధం ఒకటి నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగానే సాగుతాయి

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Scorpio

ఈ రాశి వారికి డబ్బు మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగం ఆశాజనకంగానే ఉంటుంది. పురోగతికి అవకాశం ఎక్కువ‌గా ఉంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడే అవ‌కాశం ఉంది.. వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Saggitarius

ఈ రాశి వారు కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కానీ ఖర్చులు అదుపు తప్పు అవ‌కాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన క్ర‌మేపి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకు వేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Capricorn horoscope

ఈ రాశి వారికి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రుణ బాధ చాలావరకు తగ్గుతుంది. విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి కబురు అందే ఛాన్స్ ఉంది.. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొంత నిరుత్సాహం కలిగిస్తాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Aquarius

ఈ రాశి వారు ఇష్టమైన వాళ్లతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి కొంత నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరు దగ్గర బంధువులను ఆదుకునే ఛాన్స్ ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడటం జరిగే ఛాన్స్ ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు March 27, 2024 Pisces horoscope

ఈ రాశి వారి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధు వర్గంలో వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంటుంది.. కుటుంబ సభ్యులలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం చాలా ఉంది.

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News