HomehoroscopeHoroscope Today Telugu (20-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope Today Telugu (20-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 20th March 2023: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి కి చెందిన వారి ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొలుత ఆటంకాలు ఎదురైనా.. వారాంతంలో పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. రైతులకు దిగుబడి క్ర‌మంగా పెరుగుతుంది.

Taurus | వృషభ రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశికి చెందిన వారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయ‌డం ఉత్త‌మం. వ్యాపారవేత్తలకు కాలం కలిసివస్తుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధించే అవ‌కాశం ఉంది.. ఈ రాశికి చెందిన వారి విదేశీ ప్రయాణాలు వాయిదాపడవచ్చు.

Gemini | మిథున రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశికి చెందిన వారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంటుంది . దూర ప్రయాణాలు వాయిదా పడే అవ‌కాశః ఉంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పెద్దల సలహాలు పాటించడం వల్ల అన్నిపనులు నెరవేరుతాయి.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశికి చెందిన వారు ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి అవకాశాలు పొందుతారు. పలుకుబడి ద్వారా పనులు నెరవేరే అవ‌కాశం ఉంది.కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్త‌మం. ఉత్సాహంగా పనులు చేస్తారు.

Leo | సింహ రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడితో క్ర‌మంగా పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఎంతైన అవసరం. పెద్దల సలహాలు పాటించడం ద్వారా చాలా లబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి వారికి రోజువారీ కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి కొంత పురోగతి ఉంది. రియల్‌ ఎస్టేట్‌, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారిని నిధుల లేమి వెంటాడే ఛాన్స్ ఉంది. కొంత‌ చికాకులు దూరమవుతాయి. ఆరోగ్యంగానే ఉంటారు.

Libra | తులా రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి వారికి పెద్దల సహకారం లభిస్తుంది. పనివారితో అనవసరమైన కలహాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలకు వెళ్లే ఛాన్స్ ఉంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించ‌డం ఉత్త‌మం. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. సహోద్యోగుల సహకారం కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి వారు మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పర‌చుకుంటారు. విందులకు హాజరవుతారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడే అవ‌కాశం ఉంది.. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా.. ఇప్పటికే ప్రారంభించిన వాటిని పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి వారు ఒత్తిడి ఉన్నప్పటికీ, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. భూ లావాదేవీల్లో గణనీయమైన లాభాలు గడించే అవ‌కాశం ఉంది. ప‌లు ఆలయాలు సందర్శిస్తారు. . ఆర్థికంగా లబ్ధి చేకూర‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది.

Capricorn | మకర రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి వారు తలపెట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. సంగీతం, సాహిత్యంపై మనసు నిలిపే ఛాన్స్ ఉంది.. రావలసిన డబ్బు చేతికి అందడం కొంత ఆల‌స్యం అవుతుంది.

Aquarius | కుంభ రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి వారికి ఉద్యోగంలో తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది.. అన్నిరంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ వ్యవహారాలు క్ర‌మంగాఅనుకూలిస్తాయి. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. ఆస్తి తగాదాలు కొనసాగుతాయి

Pisces | మీన రాశి ఫలాలు 20-03-2024

ఈ రాశి వారికి వాహన మరమ్మతులు ముందుకురావొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కొంత కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట ల‌భించే అవ‌కాశం ఉంది. గృహ నిర్మాణ పనులు నిరాటంకంగా కొన‌సాగిస్తారు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News