HomehoroscopeHoroscope Today Telugu (18-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today Telugu (18-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 18th february 2024: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Aries horoscope

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఖర్చులు కూడా పెరగవచ్చు. అయితే, ఊహించని ధన లాభం కూడా రావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. కొత్త బాధ్యతలు రావచ్చు. నిరుద్యోగులకు ఈ రోజు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఓ అడుగు ముందుకేస్తారు. ఒకరికొకరు దగ్గరవుతారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Taurus horoscope

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు భాగస్వాముల నుండి మంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వినగల అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆనందం కలుగుతుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Gemini

ఈ రాశి వ్యక్తులు ఈ రోజు మిత్రులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఎవరినీ నమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు అలసటకు దారితీస్తాయి. ఇంటి వద్ద కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ శరీరానికి విశ్రాంతి అవసరం. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Cancer horoscope

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఐటీ రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో మంచి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Leo

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలు చాలా నిలకడగా ఉంటాయి. డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఉద్యోగపరంగా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేయగలరు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించాలంటే కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. దూర ప్రాంతం నుండి ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోయే అవకాశం ఉంది.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Virgo

ఈ రాశి వారికి ఈ రోజు చాలా అదృష్టకరమైన రోజు. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలో మంచి ఆఫర్ అందుకోవచ్చు. పిల్లలు చదువులో మంచి పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా సానుకూలంగా కొనసాగుతాయి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Libra horoscope

ఈ రాశి వారికి ఈ రోజు కొంచెం కలవరంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యం కూడా బాధించే అవకాశం ఉంది. కాబట్టి, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల నుండి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Scorpio

ఈ రాశి వారికి ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండి బాకీలను వసూలు చేసే పనిని చురుకుగా చేస్తారు. ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Saggitarius

ఈ రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం మంచిది కాదు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Capricorn horoscope

ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, వారు తమ లక్ష్యాలను పూర్తి చేయగలరు. సహచరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడానికి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Aquarius

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. డబ్బు విషయంలో పొదుపు పాటించడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరిగి శారీరక శ్రమకు గురవుతారు. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 18, 2024 Pisces horoscope

ఈ రాశి వారికి ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగం పరిస్థితి చాలా బాగుంటుంది. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు చదువులో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు కొద్దిగా లాభాలు గడిస్తారు. ప్రేమ వ్యవహారాలు కూడా సాఫీగా సాగిపోతాయి.

 

మరిన్ని చదవండి :

Maha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?

maha shivaratri : మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు ఇవే.. పరమేశ్వర అనుగ్రహం కోసం ఇలా చేయండి..

Maha Shivaratri  : ఈ గుడిలో మోడ్రన్ డ్రెస్సులు నిషేధం.. శివరాత్రి రోజున సంప్రదాయానికి ప్రాధాన్యత..

jyotirlingas in maharashtra : మహారాష్ట్రలోని 5 జ్యోతిర్లింగాలు

Maha Shivratri : మహా శివరాత్రి నాడు ఉపవాసం వల్ల ఫలితమేంటి?

జ్యోతిర్లింగాలు ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి.. వాటి విశేషాలు

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News