Horoscope Today: astrological prediction for 01-10-2022 in telugu
01-10-2022 శనివారం మీ రాశి ఫలాలు
మేషం: వ్యాపారం చేసే వారికి ఈ రోజు మంచి రోజు అనే చెప్పాలి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అన్ని పనులు మీరు చేసుకోవడమే మంచిది. జీవిత భాగస్వామి మద్దతుతో, మీరు మీ కుటుంబ సమస్యలకు సులభంగా పరిష్కారాలను కనుగొనే అవకాశం ఉంది.
వృషభం: ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వలన ఫుల్ ఖుషీతో ఉంటారు. మధురమైన ప్రసంగంతో ప్రజల హృదయాలను గెలుచుకునే అవకాశం ఉంది.
మిథునం: ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓపికగా, సహనంతో ఉండాల్సి ఉంటుంది. కుటుంబంలోని పిల్లలకు బహుమతిని తీసుకురావచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని పెట్టుబడులు పెడతారు.
కర్కాటకం: మీరు ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పని చేస్తే, దాని వలన చాలా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అసమ్మతి నుండి కాస్త ఉపశమనం పొందుతారు. ఆహారం విషయంలో నియంత్రణ పాటించడం మంచిది.
సింహరాశి: ఈ రోజు మీరు సంభాషణ ద్వారా ఎవరితోనైన వివాదం ఉంటే దానిని ఇట్టే ముగించగలుగుతారు. సంయమనంతో వ్యవహరించడం మంచిది.ఆర్ధిక పరిస్థితి బలంగా ఉన్న నేపథ్యంలో ఖర్చులు గురించి పెద్దగా ఆలోచించరు
కన్య: ఈ రాశి వారికి చెందిన విద్యార్థులు తమ చదువులలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది. మంచి పనులతో గుర్తింపు తెచ్చుకుంటారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు పెద్ద నాయకుడిని కలిసే అవకాశం ఉంది. వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది.
తుల: ఈ రాశి వారి ఆర్ధిక పరిస్ధితి బలంగా ఉంటుంది. విదేశాలతో ఏదైనా వ్యాపార సంబంధిత ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు మీరు అందులో కూడా విజయం సాధించిఏ అవకాశం ఉంది.
వృశ్చికం: సామాజిక రంగాలలో పని చేసే వారికి నేడు శుభ దినం కానుంది. కార్యాలయంలో మీకు కొన్ని అదనపు బాధ్యతలు రానున్నాయి. జీవిత భాగస్వామితో కొన్ని ప్రేమపూర్వకమైన పనులు చేస్తారు.
ధనుస్సు: ఈ రోజు ఎలాంటి గందరగోళాలు ఎర్పడిన కూడా వాటికి ఏ మాత్రం భయపడరు. ఈ రోజు వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంటుంది.. ఒత్తిడికి లోబడి ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండడం మంచిది.
మకరం: మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. దీని వలన మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఉద్యోగం వల్ల ఇంట్లో సంతోషం కలిగే అవకాశం ఉంటుంది.
కుంభం: ఈ రోజు వారు ఆస్తికి సంబంధించిన విషయంలో తొందర పాటు పడకుండా ఉండడం మంచింది. డబ్బు విషయంలో తొందరపాటు పడకుండా ఉంటే విజయం సాధిస్తారు.
మీనం: ఈ రోజు మీరు మతపరమైన పనులలో చురుకుగా పాల్గొంటారు.. మీరు మీ భాగస్వామితో లేదంటే స్నేహితులతో బయటకు వెళ్లడం వల్ల సంతోషంతో ఉంటారు. విద్యార్థులు చదవులలో రాణించే అవకాశం ఉంది.