Horoscope Today in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 20-05-2024 తేదీన మీ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి . కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తే అవకాశం ఉంది… వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కొంత కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా సకాలంలో పనులు పూర్తి చేసుకోలేకపోతారు.
వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికం అయ్యే ఛాన్స్ ఎక్కువ. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్తలు పాటించడం చేయాలి.
మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారికి పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండుట ఉత్తమం. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది.. కుటుంబ పరిస్థితులు కూడా కాస్త సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తుతాయి.
కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారికి ఇతరులచే గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున కొంత మానసికాందోళన చెందే అవకాశం ఉంది.. ప్రతిపని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట ఉత్తమం. విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
సింహ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారు స్థిరాస్తులకు సంబంధంచిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించే సమయంలో ఆలోచించడం మంచిది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
కన్య రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల కొంత ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళనకి గురవుతారు… వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట ఎంతైన మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం అనే చెప్పాలి.. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
తుల రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక కొంత మానసికాందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తే అవకాశం ఉంది.. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండుట మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. కొంత మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకునే అవకాశం ఉంది.. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు తలెత్తుతాయ.. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశికి చెందిన వారికి ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది.. పిల్లల పట్ల మిక్కిల పట్టుదల చూపించవద్దు.
మకర రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. ప్రయాణాల్లో అప్రమత్తత పాటించలి.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఎక్కువగా ఉంటాయి.
కుంభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధాన్యం తప్పనిసరిగా చేయాలి.. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు అంత సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
మీన రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు
ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట ఉత్తమం.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు కూడా ఎక్కువే. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం కొంత ఆలస్యంగా దక్కుతుంది.