Telugu Flash News

Horoscope Today in Telugu: నవంబర్ 18, 2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu

Horoscope Today in Telugu : నవంబర్ 18, 2023 ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Aries horoscope

Aries Horoscope

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించాలి. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Taurus horoscope

Taurus Horoscope

రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Gemini

Gemini Horoscope

అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Cancer horoscope

Cancer Horoscope

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Leo

Leo Horoscope

ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు.సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Virgo

Virgo Horoscope

ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Libra horoscope

Libra Horoscope

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Scorpio

Scorpio Horoscope

కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 sagittarius

Sagittarius Horoscope

ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధవహించక తప్పదు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Capricorn horoscope

Capricorn horoscope

వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోకుండా ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది.చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Aquarius

Aquarius Horoscope

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు November 18, 2023 Pisces horoscope

Pisces Horoscope

నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

 

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

Exit mobile version