HomehoroscopeHoroscope Today in Telugu (17-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today in Telugu (17-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 17th february 2024: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎవరికీ హామీలు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు.

Taurus | వృషభ రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన అవసరాలను తీర్చుకుంటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేసే అవకాశం కూడా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్నదమ్ములతో సయోధ్య పెరుగుతుంది. బంధువులకు సంబంధించిన ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది.

Gemini | మిథున రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారు అనవసర ఖర్చు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనుల విషయంలో చాలా తిప్ప‌లు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వకుండా ఉండటం మంచిది. ప్రేమ వ్యవహారంలో కొన్ని శుభవార్తలు వింటారు.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఆవేశాలు, మొండితనం పనికిరాదు. అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఒక ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.

Leo | సింహ రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు లేదా అనవసర మాటలతో సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత విషయాల్లో సన్నిహితుల సహకారం తీసుకోవడం మంచిది. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం ఎక్కువ. అధికారుల నుండి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది.

Libra | తులా రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. కొందరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల సహాయంతో ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారు ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయ పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. బంధువుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి చికాకు పెడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. సహచరుల నుంచి సహకారం ఉంటుంది.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. దీని ద్వారా మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ పలుకుబడి కూడా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకువెళ్తారు. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి కుటుంబానికి మంచి మేలు చేస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి.

Capricorn | మకర రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ రోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పెద్దగా ఆందోళన చెందాల్సిన స్థితిలో లేదు. వాగ్దానాలు ఇవ్వడం, హామీలు ఇవ్వడం వంటివి ఈ రోజు మానుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఈ రోజు కొంచెం మందకొడిగా సాగుతాయి.

Aquarius | కుంభ రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. వ్యక్తిగత పనులు, ఇంటి పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది.

Pisces | మీన రాశి ఫలాలు 17-02-2024

ఈ రాశి వారికి ఈ రోజు బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిగా అశాంతి ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేసే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నాలతో అదనపు ఆదాయానికి అవకాశాలు మెరుగువుతాయి. పిల్లలు ఈ రోజు మంచి పురోగతి సాధిస్తారు.

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News