Homehoroscopehoroscope today in telugu : 07-08-2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu : 07-08-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 7th august 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యమైన పనుల గురించి ఆలోచించి ముందుకు సాగడం మంచిది. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్త‌మం. ఆరోగ్యం విష‌యంలో కొంత జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్యబాధలతో బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

వృషభం

ఈరోజు ఈ రాశివారు త‌మ‌ బంధు, మిత్రులను కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను పాల్గొంటారు. సొంత ఇల్లు కొనుగోలుకి ప్రయత్నాలు చేస్తారు. శుభకాలం అని చెప్పొచ్చు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.

మిథునం

ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ రోజున చేపట్టిన పనులను నిర్ణీత సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ పెద్దల మన్నన పొంద‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశముంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.

కర్కాటకం

ఈరోజు ఈ రాశివారికి ధన లాభం క‌లుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో ఆటంకం కలగకుండా చూసుకోవ‌డం మంచిది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టంపట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.

today horoscope

-Advertisement-

సింహం

ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది. పనితీరుతో ప్రశంసలను పొందుతారు. అలసట పెరగకుండా చూసుకుంటే మంచిది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలను పాటించడం ఉత్త‌మం. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయొద్దు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

కన్య

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను స‌కాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ముందడుగు వేస్తారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవ‌డం జ‌రుగుతుంది. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు.

తుల

ఈ రోజు, ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చికం

ఈరోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు వ‌స్తాయి. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం మంచిది. శుభ ఫలితాలు కలుగుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో లాభం తప్ప‌క చేకూరుతుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.

ధనస్సు

నేడు, ఈ రాశి వ్యక్తులు సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటారు. మిశ్రమ వాతావరణం ఏర్ప‌డుతుంది.. అనవసర ఖర్చులు చేస్తారు. ఫ్యామిలీతో సంతోషంగా గ‌డుపుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.

మకరం

ఈ రాశికి చెందిన వారు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో త‌ప్ప‌క ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. పని తీరుతో అందరి ప్రశంసలను పొందుతారు. అవసరానికి తగిన సహాయం వ‌స్తుంది.మానసికంగా సుఖశాంతులతో గడుపుతారు. ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసిక ఆందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కుంభం

ఈ రోజు ఈరాశివారికి బాధ్యతలు ఎక్కువ అవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్తలు వింటారు. ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. అపకీర్తి రాకుండా జాగ్రత్తపడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.

మీనం

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువ‌గా ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ‌తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Shivalingam : శివలింగం ఆకారం మెదడులోని ఈ భాగం వలె ఉంటుంది.. పనితీరు మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News