Horoscope Today, august 03, 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Aries horoscope
ఈ రాశుల వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. తొటి వారాని అన్ని విషయాలలో కలుపుకుపోతారు. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. చంద్ర ధ్యాన శ్లోకం పఠిస్తే మేలు కలుగుతుంది. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Taurus horoscope
కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం ఏర్పడుతుంది. సానుకూల ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవారాధనతో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Gemini
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సంబంధంలేని వ్యవహారాలు, పనుల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. నారాయణ మంత్రాన్ని జపిస్తే మేలు కలుగుతుంది. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Cancer horoscope
ఈ రాశివారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Leo
సమయస్ఫూర్తి, తెలివితో సమస్యలను కొంత ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏర్పడతాయి. అయితే, నిర్దిష్ట వ్యక్తులతో సంభావ్య అభిప్రాయ భేదాలకు సిద్ధంగా ఉండండి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Virgo
ఈ రాశికి మధ్యస్థ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన కార్యాలలో విజయం సాధించాలంటే దృఢ సంకల్పంతో, శ్రద్ధతో వ్యవహరించాలి. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా జాగ్రత్తపడితే మంచిది . ఆలస్యం పనికిరాదు. గణపతి సహస్రనామ పారాయణంతో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Libra horoscope
మాట విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా ఆలోచించి మాట్లాడితే మంచిది. లేకపోతే అనవసర వివాదాలు కొని తెచ్చుకుంటారు. కీలక పనుల్లో ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Scorpio
ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నతిని పొందుతారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలు వస్తాయి.. మొహమాటాన్ని దరిచేరనీయకుండా ఉండాలి . అనవరసర ఖర్చులు పెరగకుండా చూసుకోవడం మంచిది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధువులు మరియు స్నేహితులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Saggitarius
కీలకమైన పనులు, వ్యవహారాల్లో ఓపిక పట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు మీ ప్రత్యర్థులపై కూడా ప్రయోజనం పొందుతారు. చెడు సహవాసంతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఎవ్వరినీ అతిగా నమ్మకుండా ఉంటే మంచింది. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Capricorn horoscope
కీలక పనులు, వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు పాటించాలి. సానుకూల ఫలితాలు పొందడం మంచింది. ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయి బాబాను దర్శించుకుంటే మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Aquarius
బద్ధకం అస్సలు పనికిరాదు. చేపట్టిన పనుల్లో విజయం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండండి. శ్రీరామనామంతో మంచి ఫలితాలు కలుగుతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు august 03, 2023 Pisces horoscope
సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో సమస్యలను పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపడం జరుగుతుంది. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
also read :
Devotional: శంఖం సంపదకు ప్రతిరూపం.. ఎలా పూజించాలంటే..
Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?
Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?